Advertisement
Advertisement
Abn logo
Advertisement

తన కంటే 27 ఏళ్లు పెద్ద వ్యక్తిని వివాహమాడిన మహిళ.. ముసలి భర్త తన నకిలీ పళ్లతో తనను రోజూ అక్కడ కొరుకుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు.. ఈ కేసులో కోర్టు తీర్పు ఏమిటంటే..

బంగారు నగల వ్యాపారం చేసే ఒక 67 ఏళ్ల వ్యక్తి తన కంటే 27 ఏళ్లు తక్కువ వయసున్న మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ వివాహం జరిగిన కొద్ది రోజులకే అతని భార్య ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. పైశాచిక శృంగారం పేరుతో తనను వేధిస్తున్నాడని, తన నకిలీ పళ్లతో రోజూ శరీరమంతా కొరుకుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఒక బడా వ్యాపారి కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ ఘటన గుజరాత్, మధ్యప్రదేశ్‌లో జరిగింది.


గుజరాత్‌కు చెందిన గిరీష్ కుమార్ సోని(67) ఒక బంగారు నగల వ్యాపారి. గత సంవతసరం అతని భార్య కరోనాతో చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య వినీత(40, పేరు మార్చబడినది) అతని కంటే 27 ఏళ్లు వయసులో చిన్నది. వినీత మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంలో నివసించేది. ఆమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకొని గిరీష్ కుమార్‌ని పెళ్లి చేసుకుంది.


పెళ్లి తరువాత వినీత భర్తతో పాటు గుజరాత్ వెళ్లిపోయింది. అయితే పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి నుంచే గిరీష్ కుమార్ వినీతను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆమెతో వెనుక నుంచి శృంగారం జరిపేవాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బెదిరించేవాడు. శృంగారం చేసే సమయంలో తన నకిలీ పళ్లతో ఆమె శరీరమంతా ముఖ్యంగా ఆమె ప్రైవేట్ భాగాలలో గట్టిగా కొరికేవాడు.


వినీత తన భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఒకరోజు అదును చూసి మధ్యప్రదేశ్ పారిపోయింది. అక్కడ మహిళా పోలీస్ స్టేషన్‌లో తన రెండవ భర్త గిరీష్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. అతను పెట్టే చిత్రహింసల గురించి పోలీసులకు వివరించింది.  ఈ కేసులో కోర్టు ముందు వినీత తన శరీరంపై ఉన్న పళ్ల గాట్లను చూపించింది. దీంతో గిరీష్ కుమార్ నకిలీ పళ్లను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. గిరీష్ కుమార్ వేసిన బెయిల్ పిటీషన్‌ని కూడా కోర్టు తిరస్కరించింది. 


కోర్టులో తనకు ఎదురు దెబ్బ తగలడంతో గిరీష్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement