Advertisement
Advertisement
Abn logo
Advertisement

7 కేంద్రాల్లో 678 మందికి ఆశ్రయం కల్పించాం : ఆర్డీవో

మనుబోలులోని పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతున్న నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌

 మనుబోలు, నవంబరు 30: మండలంలో వరదల కారణంగా ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించి, 678 మందికి ఆశ్రయం కల్పించామని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ తెలిపారు. మంగళవారం ఆయన మనుబోలులోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఆశ్రయం పొందుతున్న బాధితులతో వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మనుబోలులో 2, మడమనూరు, బద్దెవోలు, వెంకన్నపాళెం, కట్టువపల్లి, కొలనుకుదురు, పిడూరుపాళెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించామన్నారు. అలాగే మనుబోలులోని పునరావాస కేంద్రాల్లో రెండు రోజులుగా భోజనం, తాగునీరు అందించి ఆదుకుంటున్న ఉపసర్పంచ్‌ కడివేటి చంద్రశేఖర్‌రెడ్డిని, వైసీపీ నాయకులను ఆర్డీవో అభినందించారు. కార్యక్రమంలో డీటీ అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ అన్సర్‌జాన్‌, వీఆర్వోలు నాగార్జునరెడ్డి, నాగేశ్వరరావు, కార్యదర్శి వెంకటరమణ, వైసీపీ కన్వీనర్‌ బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, దాసరి భాస్కర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement