గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,900 కోట్లు

ABN , First Publish Date - 2021-04-12T05:57:49+05:30 IST

కనివిని ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో గత ఏడాది రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారం అత్యంత సురక్షితమని భావించారు...

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,900 కోట్లు

  • కరోనా అస్థిరతలతో మారిన ఇన్వెస్టర్ల వైఖరి


న్యూఢిల్లీ: కనివిని ఎరుగని రీతిలో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో గత ఏడాది రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు బంగారం అత్యంత సురక్షితమని భావించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 14 గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి రూ.6,900 కోట్ల నిధులు రావడమే ఇందుకు నిదర్శనం. 2019-20లో పెట్టుబడులు రూ.1,614 కోట్లతో పోల్చితే గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. అలాగే 2013-14 నుంచి నిధుల క్షీణతను ఎదుర్కొన్న గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా ఇది రెండో ఏడాది. దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి గోల్డ్‌ ఈటీఎ్‌ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ 78 శాతం పెరిగి రూ.14,123 కోట్లకు చేరింది.   


Updated Date - 2021-04-12T05:57:49+05:30 IST