రికార్డు బుడతడు!

ABN , First Publish Date - 2020-09-04T05:30:00+05:30 IST

నాలుగు రకాల కంపెనీల లోగోలను గుర్తుపట్టడమే కష్టం! కానీ చెన్నైకి చెందిన ఏడేళ్ల కుర్రాడు ఏకంగా 150 రకాల కార్ల లోగోలను ఒక నిమిషంలో గుర్తించి రికార్డు సృష్టించాడు...

రికార్డు బుడతడు!

నాలుగు రకాల కంపెనీల లోగోలను గుర్తుపట్టడమే కష్టం! కానీ చెన్నైకి చెందిన ఏడేళ్ల కుర్రాడు ఏకంగా 150 రకాల కార్ల లోగోలను ఒక నిమిషంలో గుర్తించి రికార్డు సృష్టించాడు. 


  1. చెన్నైకు చెందిన కెవిన్‌ రాహుల్‌కు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ఒకసారి చూశాడంటే అది ఇక గుర్తుండిపోవాల్సిందే. ఆ ప్రతిభతోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం సంపాదించాడు.
  2. ఒక నిమిషం సమయంలోనే 150 కార్ల లోగోలను గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాహుల్‌. 
  3. ఈ బాలుడి ఒక కోరిక ఉంది. అదెంటో తెలుసా? ప్రధాని నరేంద్రమోదీని కలవడం, ఆయనతో కలిసి ఐస్‌క్రీమ్‌ తినడం. అదే విషయాన్ని తన తండ్రితో చెబితే ‘‘ఏదైనా గొప్పది సాధిస్తే నువ్వు ప్రధానిని కలిసే అవకాశం లభిస్తుంది’’ అని తండ్రి చెప్పడంతో కార్ల లోగోలను గుర్తించి రికార్డులోకెక్కాడు.

Updated Date - 2020-09-04T05:30:00+05:30 IST