Googleలో చేసిన ఈ చిన్న పని.. మహిళా నటిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది!

ABN , First Publish Date - 2021-11-29T00:53:48+05:30 IST

ముంబైకి చెందిన ఓ మహిళా నటికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. గూగుల్‌లో చేసిన చిన్న పొరపాటు.. ఆమెను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. అంతేకాకుండా వార్తల్లో కూడా నిలిపింది. కాగా..

Googleలో చేసిన ఈ చిన్న పని.. మహిళా నటిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది!

ఇంటర్నెట్ డెస్క్: ముంబైకి చెందిన ఓ మహిళా నటికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. గూగుల్‌లో చేసిన చిన్న పొరపాటు.. ఆమెను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. అంతేకాకుండా వార్తల్లో కూడా నిలిపింది. కాగా.. ఇంతకూ ఆమె చేసిన పొరపాటు ఏంటి? ఎందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రముఖ హిందీ సీరియల్లలో నటించిన ఓ ప్రముఖ నటికి ప్రస్తుతం 74ఏళ్లు. కాగా.. ఆమె మేనల్లుడికి తాజాగా పెళ్లి ఫిక్స్ అయింది. ఈ క్రమంలో పూణేలో జరుగుతున్న పెళ్లికి వెళ్లేందుకు ఆమె రెడీ అయింది. ఇందులో భాగంగానే అతడికి ఖరీదైన మందు బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వైన్‌షాప్‌ల సమాచారం కోసం.. గూగుల్‌ను ఆశ్రయించింది. అందులో రెండు నెంబర్లు కనబడటంతో.. ఓ నెంబర్‌కు కాల్ చేసి అమృత్ విస్కీని ఆర్డర్ చేసింది. ఆన్‌లైన్‌లో రూ.4,800 కూడా చెల్లించింది. అయితే.. ఆమెకు ఆ బాటిల్ హోం డెలివరీ కాలేదు. దీంతో సదరు నటి ఆగ్రహానికి లోనైంది. ఆ నెంబర్‌కు మళ్లీ కాల్ చేసి.. తన డబ్బులు రీఫండ్ చేయాలని కోరింది. 



ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వ నియమాల ప్రకారం డబ్బులు రీఫండ్ చేయాలంటే.. ఆన్‌లైన్‌ ద్వారా వైన్‌షాపులో రిజిస్టర్ చేసుకోవాలని అవతలి వాళ్లు చెప్పడంతో ముందు వెనకా ఆలోచించకుండా డెబిట్ కార్డు, ఓటీపీ సమాచారం ఇచ్చేసింది. దీంతో ఆమె సేవింగ్స్ ఖాతా మొత్తం ఖాళీ అయింది. ఈ క్రమంలో అవతలి వాళ్లు మళ్లీ ఆమెకు ఫోన్ చేసి.. డెబిట్ కార్డులో ఏదో ప్రాబ్లమ్ ఉంది.. క్రెడిట్ కార్డు వివరాలు చెప్పమనడంతో.. సదరు నటి ఆ సమాచారాన్ని కూడా ఇచ్చేసింది. ఇలా మొత్తంగా సుమారు రూ.3.05లక్షలను పోగొట్టుకున్న తర్వాత.. తాను మోసపోయినట్టు సదరు నటి గుర్తించింది. ఈ క్రమంలో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-11-29T00:53:48+05:30 IST