కుక్కపిల్లపై మొసలి దాడి.. నీళ్లలోకి దూకి రక్షించిన యజమాని!

ABN , First Publish Date - 2020-11-23T00:36:02+05:30 IST

ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్కపిల్లపై మొసలి దాడి చేయడంతో యజమాని ఒక్క ఉదుటున నీళ్లలోకి దూకి దాన్ని రక్షించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని

కుక్కపిల్లపై మొసలి దాడి.. నీళ్లలోకి దూకి రక్షించిన యజమాని!

వాషింగ్టన్: ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న కుక్కపిల్లపై మొసలి దాడి చేయడంతో యజమాని ఒక్క ఉదుటున నీళ్లలోకి దూకి దాన్ని రక్షించిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాలో మొసళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్విమ్మింగ్ ఫూల్స్‌లలో, గార్డెన్‌లలో, గోల్ఫ్ కోర్స్‌లలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై అక్కడి వారిని అవి సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఫ్లోరిడాకు చెందిన రిచర్డ్ విల్‌బ్యాంక్‌ (74) ఇంటి వద్ద ఉన్న నీటి కొలనులోకి వచ్చిన పిల్ల మొసలి.. రిచర్డ్ విల్‌బ్యాంక్ పెంచుకునే కుక్క‌పిల్లపై దాడి చేసి, దాన్ని నీటిలోకి లాక్కెళ్లింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లపై మొసలి దాడి చేయడంతో రిచర్డ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.


అనంతరం షాక్ నుంచి తేరుకుని.. తన వయసును కూడా లెక్క చేయకుండా ఒక్క ఉదుటున నీటిలోకి దూకి మొసలి బారి నుంచి కుక్కపిల్లను రక్షించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో రిచర్డ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి కొలను సమీపంలో గన్నర్‌ (కుక్కపిల్ల పేరు)తో కలసి జాగింగ్ చేస్తుండగా.. నీళ్లలోంచి మొసలి మిసైల్‌లా దూసుకొచ్చి దాన్ని అందులోకి లాక్కెళ్లింది. అయితే వెంటనే నేను స్పందించి గన్నర్‌ను రక్షించాను. ఈ క్రమంలో నాకు కొద్దిగా గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను’ అని తెలిపారు.  


Updated Date - 2020-11-23T00:36:02+05:30 IST