తమిళనాడులో గురువారం ఒక్కరోజే నమోదైన 75 కేసుల్లో ఒక్కటి తప్ప..

ABN , First Publish Date - 2020-04-03T00:16:38+05:30 IST

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో..

తమిళనాడులో గురువారం ఒక్కరోజే నమోదైన 75 కేసుల్లో ఒక్కటి తప్ప..

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 416కు చేరింది. తమిళనాడులో కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ 75 పాజిటివ్ కేసుల్లో 74 మందికి ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలతో సంబంధం ఉన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. దీంతో.. తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 309కి చేరింది.


కేరళలో కూడా 21 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. కేరళలో ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 286కు చేరింది. రాజస్థాన్‌లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. మత ప్రార్థనలకు హాజరయిన వారిలో ఇప్పటివరకూ ఢిల్లీలో 108 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

Updated Date - 2020-04-03T00:16:38+05:30 IST