భారత్‌కు ఏటా రూ.75,000 కోట్ల గండి

ABN , First Publish Date - 2020-11-21T07:58:26+05:30 IST

బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) పన్ను భారాన్ని తప్పించుకునేందుకు తమ లాభాలను కేమాన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌, లగ్జెంబర్గ్‌ వంటి పన్ను స్వర్గధామాలకు తరలిస్తుంటాయి. చాలామంది ధనికులూ తమ

భారత్‌కు ఏటా రూ.75,000 కోట్ల గండి

ప్రపంచ దేశాలకు రూ.32 లక్షల కోట్ల నష్టం 

ఎంఎన్‌సీలు, ధనికుల పన్ను ఎగవేతలపై

టీజేఎన్‌ అధ్యయన నివేదిక విడుదల 


ముంబై: బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) పన్ను భారాన్ని తప్పించుకునేందుకు తమ లాభాలను కేమాన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌, లగ్జెంబర్గ్‌ వంటి పన్ను స్వర్గధామాలకు తరలిస్తుంటాయి. చాలామంది ధనికులూ తమ సంపాదనను ఈ దేశాలకు దారి మళ్లిస్తుంటారు. దీంతో ప్రపంచ దేశాలు ఏటా 42,700 కోట్ల డాలర్ల (రూ.32.02లక్షల కోట్లు) పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయట. భారత్‌ 1,030 కోట్ల డాలర్లు (రూ.75,000 కోట్లు) మేర పన్ను ఆదాయాన్ని నష్టపోతోందట. ఈ నష్టం 3 లక్షల కోట్ల డాలర్ల  భారత జీడీపీలో 0.41 శాతానికి సమానం. ట్యాక్స్‌ జస్టిస్‌ నెట్‌వర్క్‌ (టీజేఎన్‌) అధ్యయన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ది స్టేట్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ జస్టిస్‌-2020 పేరుతో టీజేఎన్‌ తన తొలి నివేదికను విడుదల చేసింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


ఎంఎన్‌సీలు లాభాలను పన్ను స్వర్గధామాలకు మళ్లిస్తుండటం వల్ల ప్రపంచ దేశాలు 24,500 కోట్ల డాలర్ల పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. 42,700 కోట్ల డాలర్ల మొత్తం నష్టంలో ఇది 57.4 శాతానికి సమానం. 


ధనికుల పన్ను ఎగవేతల కారణంగా కోల్పోతున్న ఆదాయం 18,200 కోట్ల డాలర్లు. మొత్త నష్టంలో 42.6 శాతానికి సమానం. 


ఎంఎన్‌సీలు 1.38 లక్షల కోట్ల డాలర్ల లాభాలను, సంపన్నులు 10 లక్షల కోట్ల డాలర్లకు పైగా సంపాదనను ప న్ను స్వర్గధామాలకు తరలించారు. 

Updated Date - 2020-11-21T07:58:26+05:30 IST