తాతేకదా అని ఓ ట్రయల్ వేశాడు, కానీ దబిడిదిబిడి తట్టుకోలేక..

ABN , First Publish Date - 2020-02-19T23:28:20+05:30 IST

వృద్ధుడే కదా ఏం చేస్తాడులే..సులువుగా డబ్బు లాక్కుని పారిపోదామనుకున్నాడో దుండగుడు. కానీ తాత రంగంలోకి దిగేసరికి తోకముడిచిపారిపోయాడు.

తాతేకదా అని ఓ ట్రయల్ వేశాడు, కానీ దబిడిదిబిడి తట్టుకోలేక..

న్యూఢిల్లీ: వృద్ధుడే కదా ఏం చేస్తాడులే..సులువుగా డబ్బు లాక్కుని పారిపోదామనుకున్నాడో దుండగుడు. కానీ తాత రంగంలోకి దిగేసరికి తోకముడిచిపారిపోయాడు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సారాంశం. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేందుకు కార్డిఫ్ ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపాడు. ఏటీఎం నుంచి నగదు తీసుకున్నాక వెనక్కుతిరిగి తన కారు వద్దకు వచ్చాడు. అయితే హఠాత్తుగా.. వృద్ధుడికి ఎదురుగా వచ్చిన దుండగుడు అతడిని తోసేసి, డబ్బు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే బాధితుడు మాత్రం దుండగుడిపై పిడిగుద్దులు కురిపిస్తూ రెచ్చిపోయాడు. తగ్గేదే లేదంటూ పంచ్‌‌లు విసిరాడు. తాత ఈ రేంజ్‌లో తిరగబడతాడని ఊహించని దొంగ చివరికి తొకముడిచి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీటీవీ కెమరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు  సోషల్ మీడియా బాట పట్టి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వృద్ధుడిపై వారు ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తున్నాయి. 




Updated Date - 2020-02-19T23:28:20+05:30 IST