Jun 8 2021 @ 17:24PM

‘777 చార్లీ’.. ఓటీటీలోనే..!

కిరణ్‌రాజ్‌ దర్శకత్వంలో రక్షిత్‌ శెట్టి, సంగీతా శృంగేరి, బాబీ సింహా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘777 చార్లీ’. ఈ చిత్రంలో ఓ శునకం కీలక పాత్రను పోషించింది. కన్నడ చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరైన రక్షిత్‌శెట్టి గతంలో నటించిన ‘శ్రీమన్నారాయణ’ అనే చిత్రం కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, దక్షిణాది భాషలతో పాటు హిందీలో రిలీజ్‌ చేశారు. అదేవిధంగా ఇప్పుడాయన ‘777 చార్లీ’ అనే చిత్రంలో నటించారు. జూన్‌ 7వ తేదీన రక్షిత్‌శెట్టి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. కేవలం ఒక శునకం ఫోటోతో ఈ టీజర్‌ను ప్రింట్‌ చేసి రిలీజ్‌ చేశారు. 


ఈ టీజర్‌లో ఒక ఆడ కుక్క.. కొండ ప్రాంతంలో ఎవరినో వెతుక్కుంటూ వెళుతుంది. ఈ శునకం ప్రయాణంతో ఈ టీజర్‌ను రూపొందించారు. అడవులు, ఎత్తు పల్లాలు, చెత్త, రోడ్డు మార్గం, రైలు, లారీ ప్రయాణం, కొండ ప్రాంతం ఇలా అన్ని దారుల్లో ఆ శునకం ప్రయాణిస్తుంది. చివరకు హీరో రక్షిత్‌శెట్టి.. ఆ శునకాన్ని ఎత్తుకుని ఒక ఇంటిలోకి వెళతారు. ఇదే ఈ టీజర్‌లో చూపించారు. ఈ కుక్క ప్రయాణం ఎందుకోసం అనేదే ఈ చిత్ర కథ అని దర్శకుడు వివరించారు. ఈ చిత్రాన్ని త్వరలో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. 


ఆంధ్రప్రదేశ్ మరిన్ని...