Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమ పెళ్లికి వయసుతో సంబంధం లేదని వీళ్లిద్దరూ నిరూపించారు.. నెట్టింట వైరల్ అవుతున్న వీళ్ల కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఓ వృద్ధ జంట నిరూపించింది. నిజమైన ప్రేమ.. బంధాన్ని మాత్రమే కోరుకుంటుందని తెలిపిన ఆ జంటకు సంబంధించిన ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


78ఏళ్ల అదామ్స్ పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్. అతడి భార్య పెళ్లైన 38ఏళ్లకే అంటే 2017లో చనిపోయింది. దీంతో అతడు ఒంటరయ్యాడు. కరోనా నేపథ్యంలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ అతడిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో అతడిని ఒంటరితనం మరింత వేధించింది. ఈ క్రమంలోనే అదామ్స్ పెయింటర్.. కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో రిజిస్టర్ అయ్యాడు. తర్వాత 50 ఏళ్లు దాటిన మహిళల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి తన కంటే.. సంవత్సరం పెద్దదైన  ఓ మహిళ తారసపడింది. అదామ్స్ పెయింటర్‌ దృష్టిని ఆకర్షించిన ఆ మహిళ పేరు ఆద్రే. ఇన్సూరెన్స్ బ్రోకర్‌గా పని చేసి రిటైర్ అయిన ఆమె.. 33 ఏళ్ల క్రితమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. 


కాగా.. డేటింగ్ యాప్‌లో ఒకరికొకరు పరిచయం అయిన వీరిద్దరికీ.. ప్రేమలో పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. సుమారు ఎనిమిది నెలలుగా ప్రేమలో మునిగిపోయిన ఈ జంట.. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైంది. గత నెల 25న వివాహం చేసుకున్న ఈ దంపతుల ఫొటోలను ఫొటో గ్రాఫర్ జూలియో రాంఢ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అదామ్స్ పెయింటర్, ఆద్రే పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు ఈ వృద్ధ జంట ప్రేమ కథను తెగ పొగిడేస్తున్నారు. ఈ పోస్టును ఇప్పటికే 1.5లక్షల మంది వీక్షించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement