Abn logo
Sep 21 2021 @ 17:57PM

భార్య మృతదేహం వద్ద దీనంగా కూర్చున్న భర్త.. అసలు నిజం తెలిసి విస్తుపోయిన స్థానికులు..!

ఇంటర్నెట్ డెస్క్: ఇతర కుటుంబసభ్యులు అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టారు. అయితే.. నట్టింట్లో కనిపించిన దృశ్యం చూసి వారికి గుండె ఆగినంతపనైంది. భార్య మృతదేహం పక్కనే కూర్చున్న యువకుడు.. నిర్జీవంగా పడి ఉన్న భార్యవైపు దీనంగా చూస్తూ కనిపించాడు. ఈ వార్త స్థానికంగా దావానంలా వ్యాపించింది. విషయం తెలిసిన చుట్టుపక్కల వారందరూ ముక్కన వేలేసుకున్నారు. ఇంత చిన్న గొడవ ఇంత పెద్ద విషాదానికి ఎందుకు దారితీసిందో తెలియక నోరేళ్లబెట్టారు. అసలేం జరిగిందంటే...

ఇవీ చదవండి:

గంటల వ్యవధిలో రూ. 7300 కోట్లు హాం ఫట్.. ఓ బిలియనీర్‌కు భారీ షాక్..!

రైల్లో ఒంటరిగా మహిళ జర్నీ.. తన సీట్లోనే కూర్చుని నిద్రలోకి.. సడన్‌గా నిద్రలోంచి లేచి చూస్తే ఎదురుగా..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లాకు చెందిన బలరామ్ పటేల్‌ వివాహితుడు. అతడికి మూర్ఛ వ్యాధి ఉండటంతో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాడు. ఆ దంపతులకు 7 నెలల చిన్నారి కూడా ఉంది. అయితే.. ఆదివారం సాయంత్రం.. పాప పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించింది. ఎంత బుజ్జగించినా కూడా ఏడుపు మానలేదు. దీంతో బలరామ్ భార్య..భర్త తీసుకునే సిరప్‌ను పాపకు ఇవ్వబోయింది. బలరామ్‌ మాత్రం భార్యను వద్దంటూ వారించారు. ఆమె మాత్రం భర్త మాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.. అది చూస్తుండగానే తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో బలరామ్ విచక్షణ కోల్పోయి.. భార్య మెడకు చీరు చుట్టి ఊపిరాకుండా చేసి చంపేశాడు. ఆపై భార్య పక్కనే విషణ్ణవదనంతో కూర్చుండిపోయాడు. ఈలోపు..ఇంటికి వచ్చిన ఇతర కుటుంబసభ్యులు జరిగిన ఘోరం తెలుసుకుని షాకైపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం.. పోలీసులు బలరామ్‌ను అరెస్టు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...