US: ఇసుక తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి!

ABN , First Publish Date - 2021-07-27T19:20:44+05:30 IST

అమెరికాలోని ఉటాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో మిల్లార్డ్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ హైవే 15పై 22 వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి.

US: ఇసుక తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి!

ఉటా: అమెరికాలోని ఉటాలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో మిల్లార్డ్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ హైవే 15పై 22 వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్లు ఉటా హైవే పెట్రోల్ పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని, ఆదివారం సాయంత్రం 4.30(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదివారం హైవే 15ను పూర్తిగా మూసివేశారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.   




Updated Date - 2021-07-27T19:20:44+05:30 IST