ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది పౌరసత్వానికి ముప్పు: ఒవైసీ

ABN , First Publish Date - 2020-02-23T07:27:21+05:30 IST

దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది భారతీయుల పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది పౌరసత్వానికి ముప్పు: ఒవైసీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది భారతీయుల పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం ఆయన లఖ్‌నవూలో జరిగిన హిందూస్థాన్‌ సమాగమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్పీఆర్‌, ఎన్నార్సీల కన్నా అభివృద్ధి ముఖ్యమని, ఎన్నార్సీ ప్రక్రియకు రూ.65వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. షాహీన్‌బాగ్‌ నిరసనలు ఆరోగ్యకరమైనవేనని, రాజ్యాంగాన్ని కాపాడటానికి వాళ్లంతా పోరాడుతున్నారన్నారు.

Updated Date - 2020-02-23T07:27:21+05:30 IST