కరోనా కాలంలో ఏటీఎంలో చోరి! 10 నిమిషాల్లోనే రూ.8 లక్షలు మాయం!

ABN , First Publish Date - 2020-06-01T22:21:57+05:30 IST

పరిస్థితులకు అణుగుణంగా మారితే వృత్తిజీవితంలో దూసుకుపోవచ్చు. విజాయానికి సూత్రం ఇదే. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్న ఓ దొంగ ఏటీఎంను లూటీ చేసి దాదాపు 8 లక్షల రూపాయలతో ఉడాయించాడు.

కరోనా కాలంలో ఏటీఎంలో చోరి! 10 నిమిషాల్లోనే రూ.8 లక్షలు మాయం!

చెన్నై: పరిస్థితులకు అణుగుణంగా మారితే వృత్తిజీవితంలో దూసుకుపోవచ్చు. విజాయానికి సూత్రం ఇదే. ఈ విషయాన్ని బాగా ఒంటబట్టించుకున్న ఓ దొంగ ఏటీఎంను లూటే చేసేందుకు.. ప్రస్తుమున్న కరోనా పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఏకంగా 8 లక్షల రూపాయలతో ఉడాయించాడు. పారిశుధ్య సిబ్బంది ధరించే  డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని వీపుకు ధరించి సెక్యురిటీ గార్డును బురిడీ కొట్టించి డబ్బుతో జంపైపోయాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ చోరి జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏంటీను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎం కేంద్రం లోపల క్రిమిసంహారకాలను చల్లాలని చెప్పుకొచ్చాడు. అతడి వాలంకం, వీపుకు ధరించిన డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నిజమేననుకున్నాడు. నిందితుడిని పారిశుద్య శిబ్బందిగా పొరబడి  ఏటీఎం కేంద్రం లోపలికి అనుమతించాడు. తాను యథాప్రకారం బయటకు వచ్చి నిలబడ్డాడు.


కావాల్సి ప్రైవసీ దొరకడంతో నిందితుడు తాపీగా తన పనిని ప్రారంభించాడు. ఈ లోపు మరో కస్టమర్ ఏటీఎంలోని వెళ్లాడు. నిందితుడు కరెన్సీ చెస్ట్‌పైనున్న బటన్లు నొక్కుతుండటాన్ని చూసి అతడిని బ్యాంకు అధికారి పొరబడి బయటకి వచ్చేశాడు. ఇలా తనకు ఏ ఆటంకం ఎదురవకపోవడంతో నిందితుడు 8.2 లక్షల రూపాయలను చోరి చేసి డబ్బుతో వడివడిగా బయటకువచ్చేశాడు.


అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న ఓ ఆటో ఎక్కి ఉండాయించాడు. అక్కడే వేచి చూస్తున్న కస్టమర్‌కు అనుమానం రావడంతో అతడు సెక్యురిటీ గార్డును అప్రమత్తం చేశాడు. ఇద్దరూ కలిసి నిందుతుడి వెంట పడినప్పటికీ ఉపయోగం లేకపోయింది. కేవలం పదంటే పదే నిమిషాల్లో నిందితుడు తన పని పూర్తి చేసుకుని డబ్బుతో జంపైపోయాడు.


అయితే చోరి జిరిగిన తీరు, నిందితుడు సరైన పాస్‌వర్డ్, తాళాలు వాడటం వంటి వాటిని బట్టి అతడికి బ్యాంకు అధికారుల సహాయం అంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

Updated Date - 2020-06-01T22:21:57+05:30 IST