‘80 vs 20’ ముస్లింలను ఉద్దేశించి కాదు: బీజేపీ నేత

ABN , First Publish Date - 2022-01-11T21:12:27+05:30 IST

వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో హిందువుల జనాభా 79.73 శాతం కాగా ముస్లింల జనాభా 19.26 శాతం ఉన్నారు. ఇక క్రైస్తవుల జనాభా 0.18 కాగా సిక్కుల జనాభా 0.32 ఇంకా ఇతరులు ఉన్నారు. ఇది విపక్షాలు చూపిస్తున్న లెక్కలు కాగా..

‘80 vs 20’ ముస్లింలను ఉద్దేశించి కాదు: బీజేపీ నేత

న్యూఢిల్లీ: ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘80 వర్సెస్ 20’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. యూపీలోని 80 శాతానికి సమీపంగా ఉన్న హిందువులను 20 శాతానికి సమీపంగా ఉన్న ముస్లింలను ఉద్దేశించి యోగి ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్షాలు సహా నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ముస్లింలను ఉద్దేశించి యోగి ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఆయన లెక్కలు వేరే ఉన్నాయని భారతీయ జనతా పార్టీకి చెందిన అలోక్ వాట్స్ అన్నారు.


వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో హిందువుల జనాభా 79.73 శాతం కాగా ముస్లింల జనాభా 19.26 శాతం ఉన్నారు. ఇక క్రైస్తవుల జనాభా 0.18 కాగా సిక్కుల జనాభా 0.32 ఇంకా ఇతరులు ఉన్నారు. ఇది విపక్షాలు చూపిస్తున్న లెక్కలు కాగా.. యూపీలో 9 శాతం క్రిమినల్స్, 3.5 శాతం భూకబ్జాదారులు, 2 శాతం పాకిస్తాన్ అనుకూలురు, 1.5 శాతం వందేమాతరం నినాదానికి వ్యతిరేకులు ఉన్నారని ఆ ఉద్దేశంతోనే 20 శాతం బీజేపీ వ్యతిరేకులని యోగి అన్నారని అలోక్ సమాధానం చెప్పారు.


అయితే అలోక్ సమాధానంపై డిబేట్‌లో ఉన్న కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథె నవ్వారు. ఈ డేటా ఎక్కడి నుంచి తెచ్చారని అడగ్గా.. ‘సోషల్ స్టడీ’ అని సమాధానం ఇచ్చారు. ‘ఏ సోషల్ స్టడీ?’ అని సుప్రియా మరోసారి ప్రశ్నించగా ‘‘ఎందుకు నవ్వుతున్నారు? ఇదేమీ ముస్లింలకు సంబంధించిందని యోగి చెప్పలేదు కదా?’’ అంటూ అలోక్ అసహనానికి లోనయ్యారు.

Updated Date - 2022-01-11T21:12:27+05:30 IST