యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం

ABN , First Publish Date - 2021-01-12T16:14:13+05:30 IST

గల్ఫ్ దేశం యూఏఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.

యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం

అబుధాబి: గల్ఫ్ దేశం యూఏఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 80,683 మందికి టీకా వేసినట్లు యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,167,251కు చేరింది. మహమ్మారి కట్టడి కోసం యూఏఈ ఆరోగ్యశాఖ, దేశానికి చెందిన ప్రముఖ హెల్త్ అధికారులు సంయుక్తంగా నేషనల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం పని చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు టీకాపై ఉన్న అపోహలను తొలగించి, భారీ సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. కరోనా నుంచి కాపాడేందుకు తక్కువ సమయంలో 50 శాతం ప్రజలకు టీకా ఇవ్వాలనే ఉద్దేశంతో యూఏఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తోంది. ఇదిలాఉంటే.. యూఏఈలో తీవ్ర ప్రభావం చూపుతున్న కొవిడ్ ఇప్పటి వరకు 2.32 లక్షల మందికి సోకింది. ఇందులో 711 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 23,905 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

Updated Date - 2021-01-12T16:14:13+05:30 IST