83 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2021-09-29T06:44:31+05:30 IST

జిల్లాలో మంగళవారం 83 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి.

83 కొవిడ్‌ పాజిటివ్‌లు

11,800 మందికి టీకా

ఒంగోలు (కార్పొరేషన్‌/కలెక్టరేట్‌), సెప్టెంబరు 28 : జిల్లాలో మంగళవారం 83 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకూ 1,37,038 మంది వైరస్‌ బారినపడ్డారు. 1,34,232 మంది కోలుకున్నారు. 1,090 మంది మరణించారు. ప్రస్తుతం 1,716 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.  మంగళవారం 107 కేంద్రాల్లో  11,800 మందికి టీకాలు వేశారు. వీరితో కలిపి ఇప్పటి వరకూ 27,14,498 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Updated Date - 2021-09-29T06:44:31+05:30 IST