Advertisement

83 trailer : కపిల్‌దేవ్ అండ్ టీమ్ చారిత్రక విజయం

భారత క్రికెట్ చరిత్రలో హర్యానా హరికేన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు కపిల్‌దేవ్. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఆయన ఆల్ రౌండర్. 1983 లో భారత్ కు మొట్టమొదటి సారిగా వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్ గా ఆయన్ని ఎవరూ మరిచిపోలేరు. ఆ టైమ్ లో తన టీమ్ ను ఎలా లీడ్ చేశారు? టీమ్ సభ్యుల్లో ఉత్సాహాన్ని ఎలా నింపారు? అన్న విషయాలు సాధారణ క్రికెట్ ప్రేమికులకు తెలీదు. అందుకే కపిల్‌దేవ్ జీవిత చరిత్రపై బాలీవుడ్ లో ఇప్పుడో సినిమా రాబోతోంది. పేరు ‘83’. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రకు రణ్‌వీర్ సింగ్ ప్రాణం పోస్తున్నారు.  పాన్ ఇండియా రేంజ్ లో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ వెర్షన్  ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 3 నిమిషాల 49 సెకన్ల డ్యూరేషన్ తో వచ్చిన ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


1983‌లో ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్‌కప్ జెర్నీని అత్యంత సహజంగా చూపించారు దర్శకుడు కబీర్ ఖాన్. ఈ టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న సవాళ్ళు, గెలిచిన తర్వాత వారిలోని భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అసలు ఈ టోర్నీలో భారత్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అప్పట్లో అందరూ భయపడే వెస్ట్ ఇండీస్ టీమ్ తో ఫైనల్ లో తలపడి.. భారతీయులు కలలో కూడా ఊహించని రీతిలో వరల్డ్ కప్ సాధించి.. చరిత్ర సృష్టించింది కపిల్ దేవ్ అండ్ టీమ్. ఆ ఆనంద క్షణాలు, ఆ విజువల్స్ తో ట్రైలర్ కట్ చేశారు.  ఇందులో కపిల్ భార్యగా దీపికా పదుకొణే నటించారు. మిగతా పాత్రల్లో పంకజ్ త్రిపాఠీ, జీవా, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ శర్మ, సాకీబ్ సలీమ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా  ను కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియావాలాలు సంయుక్తంగా నిర్మించగా.. తెలుగులో నాగార్జున, తమిళ్ లో కమల్ హాసన్, మలయాళంలో పృధ్విరాజ్ సుకుమారన్, కన్నడలో సుదీప్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.   Advertisement

Bollywoodమరిన్ని...