రెండో దశలో.. కోవిడ్‌-19

ABN , First Publish Date - 2020-04-09T10:25:25+05:30 IST

కోవిడ్‌ -19 వ్యాధి జిల్లాలో రెండో దశలోనే ఉందని, సామాజిక వ్యాప్తి(మూడో) దశకు ఇంకా చేరలేదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ

రెండో దశలో.. కోవిడ్‌-19

84 ఆసుపత్రులను సిద్ధం

డీఎంహెచ్‌వో యాస్మిన్‌ వెల్లడి


సిటీ న్యూస్:  కోవిడ్‌ -19 వ్యాధి జిల్లాలో రెండో దశలోనే ఉందని, సామాజిక వ్యాప్తి(మూడో) దశకు ఇంకా చేరలేదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధిక కేసులు గుంటూరు నగర పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ వైరస్‌ కేసులు ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారానే వ్యాపిస్తున్నట్లు గుర్తించామని, సామాజిక వ్యాప్తి దశకు చేరలేదన్నారు. గుంటూరులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మూడో దశకు చేరాయా? లేదా? అని తెలుసుకునేందుకు త్వరలో కమ్యూనిటీ సర్వెలెన్స్‌ చేపడుతున్నట్లు తెలిపారు.


వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 50 మంది వైద్యులను కమ్యూనిటీ సర్వెలెన్స్‌ నిర్వహణకు వినియోగించుకుంటామన్నారు.  పలు చోట్ల కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో గుంటూరు మొత్తాన్ని రెడ్‌జోన్‌గా భావించి చర్యలు తీసుకుంటున్నట్లు కరోనా జిల్లా సర్వెలెన్స్‌ అధికారి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రత్నావళి తెలిపారు. వైద్య సిబ్బందికి తగిన రక్షణ సామాగ్రి ఉన్నాయన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ  పఽథకం కింద 84 నెట్‌వర్క్‌ ఆసుపత్రులను కోవిడ్‌-19 రోగుల సేవలకు వినియోగించేందుకు సిద్దం చేసి ఉంచినట్లు జిల్లా ఇమ్యునైజేషన్‌ అఽధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌ తెలిపారు.


జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ రోగుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సమావేశంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ టీ రమేష్‌, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జీ చంద్రశేఖర్‌, డాక్టర్‌ సునీల తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T10:25:25+05:30 IST