8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ

ABN , First Publish Date - 2021-04-20T05:26:11+05:30 IST

కాగువాడ రామ మందిరం వీధిలో నివాసముంటున్న బుద్ధ ప్రధాన్‌ ఇంటిలో సుమారు రూ.2,12,500 విలువైన 8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం

ఆలస్యంగా వెలుగుచూసిన వైనం

పాతపట్నం : కాగువాడ రామ మందిరం వీధిలో నివాసముంటున్న బుద్ధ ప్రధాన్‌ ఇంటిలో సుమారు రూ.2,12,500 విలువైన 8.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుద్ధ ప్రధాన్‌ ఈనెల 14న కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని స్వల్ప అస్వస్థతకు గురై ఈ నెల 15 న ఒడిశాలోని జాజిపురంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. ఈ నెల 18న విజయ వాడలోని కుమారుడు స్వగ్రామానికి రాగా తల్లి కుమార్తె ఇంటికి వెళ్లిందని తెలుసుకుని ఇంటిని పరిశీలించేందుకు వెళ్లాడు. అప్పటికే తాళం విరగ్గొట్టి ఉండి ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండడాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ విషయాన్ని తల్లికి తెలిపాడు. కాగా ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో క్లూస్‌ టీం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. కాగా కుమార్తె ఇంటి నుంచి వచ్చిన బుద్ధప్రధాన్‌ తన ఇంట్లో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాల వివరాలను పోలీసులకు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌అమీర్‌ ఆలీ తెలిపారు.


Updated Date - 2021-04-20T05:26:11+05:30 IST