Abn logo
Sep 19 2021 @ 10:35AM

9 కోట్లకు పైగా ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

                        - కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌


ప్యారీస్‌(చెన్నై): తొమ్మిది కోట్లకు పైగా ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు పంపిణి చేసినట్టు కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక పురసైవాక్కంలో శనివారం కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫొటోప్రదర్శనను కేంద్ర మంత్రి మురుగన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఉన్న గృహిణులందరికీ జన్‌ధన్‌ పథకం ద్వారా బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించడంతో పాటు కేంద్రం తరఫున రాయితీలను వారి ఖాతాల్లోనే జమచేస్తున్నట్లు తెలిపారు. 70 ఏళ్లలో సాధించలేని విజయాలు ఏడేళ్లలో సాధించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ తమిళనాడు జాలర్ల సంఘం అధ్యక్షుడు సతీష్ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి మురుగన్‌ నిరుపేదలకు 710 కేజీల చేపలు ఉచితంగా పంపిణీ చేశారు.