9 నెలలు.. రూ.1.17 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-02-14T06:39:23+05:30 IST

ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు ఆగడం లేదు. కేటుగాళ్లు ఏదోరకంగా బ్యాంకులకు టోపీ పెడుతున్నారు. వేల కోట్లు దోచుకుంటున్నారు.

9 నెలలు.. రూ.1.17 లక్షల కోట్లు

పీఎస్‌బీల పుట్టి ముంచుతున్న మోసాలు


ఇండోర్‌: ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బ్యాంకుల్లో మోసాలు  ఆగడం లేదు. కేటుగాళ్లు ఏదోరకంగా బ్యాంకులకు టోపీ పెడుతున్నారు. వేల కోట్లు దోచుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొమ్మిది నెలల్లోనే దేశంలోని 18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) 8,926 మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కింద మంజూరైన రుణాల విలువ రూ.1,17,463.73 కోట్లు. చంద్రశేఖర్‌ గౌర్‌ అనే సమాచార హక్కు కార్యకర్త దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ అధికారవర్గాలు ఈ విషయం వెల్లడించాయి. ఇందులో రూ.30,300 కోట్ల విలువైన 4,769  కేసులతో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. మోసపూరిత కేసుల కింద పీఎ్‌సబీలు నష్టపోయున మొత్తంలో ఇది 26 శాతానికి సమానం. పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంకులూ గత తొమ్మిది నెలల్లో మోసగాళ్లతో భారీగా నష్టపోయాయని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-02-14T06:39:23+05:30 IST