ఆవిరి పట్టబోయి బాలుడికి తీవ్రగాయాలు.. సర్జరీ

ABN , First Publish Date - 2021-05-10T13:07:05+05:30 IST

ఆవిరి పట్టబోయి బాలుడికి తీవ్రగాయాలు.. సర్జరీ

ఆవిరి పట్టబోయి బాలుడికి తీవ్రగాయాలు.. సర్జరీ

హైదరాబాద్/రాయదుర్గం : కరోనా నియంత్రణ కోసం ఆవిరి పట్టబోయి బాలుడి(9)కి తీవ్రగాయాలు కావడంతో కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన సర్జరీ చేసి నూతన జీవితాన్ని ఇచ్చారు. సర్జరీ వివరాలను ఆస్పత్రి పిడియాట్రిషన్‌ డాక్టర్‌ అజుం దయాల్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల బాలుడికి వేడినీళ్లతో ఆవిరిపట్టబోయి ఆ నీళ్లు ఒంటిపై పడి 25శాతం గాయలపాలయ్యాడు. దీంతో అతనికి ఆస్పత్రిలోని పిడియాట్రిక్‌ ఇంటెన్‌సివ్‌ కేర్‌లో పెట్టి ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా చికిత్స చేశామని తెలిపారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-10T13:07:05+05:30 IST