90 శాతం యాక్టివ్‌ కేసులు 8 రాష్ట్రాల్లోనే..

ABN , First Publish Date - 2020-07-10T07:26:20+05:30 IST

కరోనా మరణాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కొవిడ్‌-19పై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్థన్‌ అధ్యక్షతన...

90 శాతం యాక్టివ్‌ కేసులు 8 రాష్ట్రాల్లోనే..

  • దేశంలోని 49 జిల్లాల్లోనే 80 శాతం
  • జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

న్యూఢిల్లీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): కరోనా మరణాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కొవిడ్‌-19పై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్థన్‌ అధ్యక్షతన గురువారం బృందం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేలా సూచనలు ఇస్తున్నామని పేర్కొంది. 


వారు వెల్లడించిన వివరాల ప్రకారం..

  1. యాక్టివ్‌ కేసుల్లో 90శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, గుజరాత్‌, యూపీలవే. 49 జిల్లాల్లోనే 80ు యాక్టివ్‌ కేసులున్నాయి.
  2. 86శాతం కొవిడ్‌ మరణాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లోనే నమోదయ్యాయి. ఇందులోనూ 80శాతం మరణాలు 32 జిల్లాలవే.
  3. భారత్‌లో 10 లక్షల జనాభాకు 538 కేసులు నమోదవగా.. 15 మరణాలు సంభవించాయి. ప్రపంచంలో 10 లక్షల జనాభాకు 1,453 కేసులు నమోదవగా.. 68.7 మంది చనిపోయారు.
  4. దేశంలో 3,77,737 ఐసోలేషన్‌ పడకలు (ఐసీయూ సపోర్ట్‌ లేనివి), 39,820 ఐసీయూ పడకలు, 1,42,415 ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న పడకలు, 20,047 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.
  5. రాష్ట్రాలకు 21.3 కోట్ల ఎన్‌-95 మాస్కులు, 1.2 కోట్ల పీపీఈ కిట్లు, 6.12 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను కేంద్రం పంపిణీ చేసింది. 
  6. హాట్‌స్పాట్‌గా మారే ముప్పున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. పరీక్షల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి. వృద్ధు లు, దీర్ఘకాల వ్యాధి పీడితులను పర్యవేక్షించాలి.

Updated Date - 2020-07-10T07:26:20+05:30 IST