Advertisement
Advertisement
Abn logo
Advertisement

జూమ్‌ కాల్‌.. గుండె గుభేల్‌!

900 మంది ఉద్యోగులకు ఉద్వాసన


న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థ 900 మంది ఉద్యోగులను జూమ్‌కాల్‌లో తొలగించింది! సీఈవో విశాల్‌ గార్డ్‌ గత బుధవారం ఉద్యోగులకు జూమ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘ఇది మీరు వినేందుకు ఇష్టపపడని వార్త. అయినా తప్పదు. మీ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాం. ఇది వెంటనే అమల్లోకి వస్తోంది’ అని పేర్కొన్నారు. అమెరికాలో త్వరలో సెలవుల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఇది శరాఘాతమేనని చెబుతున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 15శాతం మందిని సంస్థ తొలగించడం గమనార్హం.

Advertisement
Advertisement