నాలుగు గంటలకే లేచి మొక్కలకు నీరు.... తాతకు అభినందనలు!

ABN , First Publish Date - 2020-10-21T12:15:44+05:30 IST

సాధారణంగా ఎవరైనా సరే తమ ఇంటి ముంగిట్లో ఉన్న మొక్కలను సంరక్షించేందుకు ఉదయం 4 గంటలకే లేవరు. కానీ హర్యానాలోని...

నాలుగు గంటలకే లేచి మొక్కలకు నీరు.... తాతకు అభినందనలు!

గురుగ్రామ్: సాధారణంగా ఎవరైనా సరే తమ ఇంటి ముంగిట్లో ఉన్న మొక్కలను సంరక్షించేందుకు ఉదయం 4 గంటలకే లేవరు. కానీ హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన 91 ఏళ్ల తాత ఉదయం 4 గంటలకే లేచి 5 గంటల వరకూ రోడ్డు పక్కన ఉన్న మొక్కలకు నీరు పోస్తుంటారు. నడుం నొప్పితో బాధపడుతున్న ఈ తాత నడుముకు బెల్టు కట్టుకునిమరీ మొక్కలకు నీరుపోసే పని చేస్తుంటారు. 


చేతిలో కర్ర పట్టుకుని డివైడర్ల వద్దకు వెళ్లి అక్కడి మొక్కలకు నీరు పోస్తుంటారు. ఈ పనిని తాత చాలా ఏళ్లుగా చేస్తున్నారు. ఈ తాతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా తాతను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి నితిన్ సాంగ్వాన్ షేర్ చేశారు. దానికి క్యాప్షనగా... అతని వయసు 91. నడుం సరిగా నిలబడదు. అయినప్పటికీ గురుగ్రామ్‌లో ఉదయం 4 గంటలకు పబ్లిక్ రోడ్ల వద్దనున్న మొక్కలకు నీరు పోసేందుకు ఉపక్రమిస్తారు’ అని రాశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనికి 14.6 వేల లైక్‌లు, 2.1 వేల రీ ట్వీట్‌లు దక్కాయి. అలాగే ఈ తాతకు సంబంధించిన వీడియోను లక్షా 25 వేల మంది వీక్షించారు. 

Updated Date - 2020-10-21T12:15:44+05:30 IST