APP పోస్టులకు 92 మంది ఎంపిక

ABN , First Publish Date - 2021-12-09T14:22:01+05:30 IST

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టులకు 92 మంది అభ్యర్థులను పోలీస్‌ నియామక మండలి ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు..

APP పోస్టులకు 92 మంది ఎంపిక

హైదరాబాద్: అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) పోస్టులకు 92 మంది అభ్యర్థులను పోలీస్‌ నియామక మండలి ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు అటస్టేషన్‌ ఫాంను ఈ నెల 13లోగా www.tslprb.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు సూచించారు. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి.. అటస్టేషన్‌ ఫాంను డౌన్‌లోడ్‌ చేసుకుని.. గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించాలన్నారు. అప్‌లోడ్‌ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 93937 11110 నంబరులో సంప్రదించాలని సూచించారు.   

Updated Date - 2021-12-09T14:22:01+05:30 IST