Advertisement
Advertisement
Abn logo
Advertisement

93 ఏళ్ల వృద్ధురాలి నేత్రదానంతో ఇద్దరికి చూపు

హైదరాబాద్ సిటీ/భెల్‌కాలనీ : నేత్రదానంతో మరో ఇద్దరికి చూపును అందించవచ్చని చాటారు 93ఏళ్ల వృద్ధురాలు. నల్లగండ్లలోని లక్ష్మీ విహార్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో నివసించే భెల్‌ విశ్రాంత జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషు తల్లి సరస్వతమ్మ(93) ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నేత్రదాన ప్రచారకర్త, విజయ ఆస్పత్రి ఎండీ అల్లం పాండురంగరావు సరస్వతమ్మ కుమారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రాలను దానం చేయాలని కోరారు. దీంతో ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రి వైద్యులు వృద్ధురాలి నేత్రాలను సేకరించారు. నేత్రదానం చేయదలచిన దాతలు 9848044814లో సంప్రదించాలని పాండు రంగారావు కోరారు.

Advertisement
Advertisement