దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్న 96 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-09-20T13:53:37+05:30 IST

'వందే భారత్ మిషన్‌'లో భాగంగా దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం 96 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.

దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్న 96 మంది భారతీయులు

మొహలీ: 'వందే భారత్ మిషన్‌'లో భాగంగా దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం 96 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. శనివారం సాయంత్రం 4.13 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అయింది. వీరిలో చాలా మంది పంజాబ్, హర్యానాలకు చెందిన ప్రవాసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు ఆయా రాష్ట్రాల క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలియజేశారు. విమానాశ్రయానికి చేరుకున్న 96 మంది ప్రయాణికుల్లో ఏ ఒక్కరిలో కూడా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ బృందాలు ప్రయాణికులను ముఖానికి మాస్కు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు వాడటం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూర ప్రమాణాలను పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.    


Updated Date - 2020-09-20T13:53:37+05:30 IST