స్కూల్ బస్ వెళ్లిపోవడంతో 9వ తరగతి విద్యార్థి షాకింగ్ నిర్ణయం.. ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి.. తాడు తీసుకుని..

ABN , First Publish Date - 2021-11-23T01:09:12+05:30 IST

అతడికి 14ఏళ్లు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. కానీ.. సోమవారం మాత్రం స్కూల్ ఉండటంతో.. ఎప్పటిలాగే ఉదయాన్

స్కూల్ బస్ వెళ్లిపోవడంతో 9వ తరగతి విద్యార్థి షాకింగ్ నిర్ణయం.. ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి.. తాడు తీసుకుని..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 14ఏళ్లు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. కానీ.. సోమవారం మాత్రం స్కూల్ ఉండటంతో.. ఎప్పటిలాగే ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యాడు. బ్యాగు తీసుకుని రోడ్డుపైకి వెళ్లాడు. అయితే అప్పటికే స్కూల్ బస్ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్తాపం చెందాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన రాహుల్‌కు స్కూల్‌కు వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఒక్కరోజు కూడా స్కూల్ గైర్హాజరయ్యేవాడు కాదు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం ఉదయాన్నే నిద్రలేచిన రాహుల్.. స్కూల్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అనంతరం బ్యాగు తీసుకుని.. బస్‌స్టాప్ వద్దకు బయల్దేరాడు. అయితే రాహుల్ అక్కడికి వెళ్లేలోపే స్కూల్‌బస్ వెళ్లిపోయింది. దీంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఏడ్చుకుంటూ వెళ్లి.. బ్యాగ్‌ను ఇంట్లో పెట్టేశాడు.


ఆ తర్వాత ఇంట్లో ఉన్న తాడును తీసుకుని.. ఇంటి వెనకాల ఉన్న చెట్టు వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు.. రాహుల్‌ను వెంటనే హాస్పటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ అతడిని వైద్యులు పరీక్షించి.. రాహుల్ చనిపోయినట్టు తేల్చేశారు. దీంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అవడంతో అధికారులు స్పందిస్తూ.. పిల్లలు చేస్తున్న పనులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.



Updated Date - 2021-11-23T01:09:12+05:30 IST