ఆ కుర్రాడికి స్కూళ్లో స్నేహితుడితో గొడవ.. అతడిని బెదిరించడానికి చేసిన పని ఆ కుర్రాడిని కటకటాల పాలు చేసింది!

ABN , First Publish Date - 2022-01-12T17:55:52+05:30 IST

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. తన క్లాస్‌మేట్‌తో ఆ కుర్రాడికి గొడవ జరిగింది..

ఆ కుర్రాడికి స్కూళ్లో స్నేహితుడితో గొడవ.. అతడిని బెదిరించడానికి చేసిన పని ఆ కుర్రాడిని కటకటాల పాలు చేసింది!

ఆ కుర్రాడు పదో తరగతి చదువుతున్నాడు.. తన క్లాస్‌మేట్‌తో ఆ కుర్రాడికి గొడవ జరిగింది.. అతడిని బెదిరించడానికి ఆ కుర్రాడు తర్వాతి రోజు ఉదయం స్కూల్‌కు ఓ తుపాకీ తీసుకెళ్లాడు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తుపాకీ చూపించి చంపేస్తానని బెదిరించాడు.. బెదిరిపోయిన కుర్రాడు తర్వాతి రోజు స్కూలుకు రావడం మానేశాడు.. అతని మేనమామ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


మధ్యప్రదేశ్‌‌లోని బేతుల్ జిల్లాలో ముల్తాయ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కుర్రాడికి గత శనివారం క్లాస్‌మేట్‌తో గొడవ జరిగింది. దీంతో క్లాస్‌మేట్‌‌ను బెదిరించేందుకు సోమవారం ఉదయం ఆ కుర్రాడు తుపాకీ తీసుకెళ్లాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తుపాకీ చూపించి చంపేస్తానని క్లాస్‌మేట్‌ను బెదిరించాడు. దీంతో ఆ బాలుడు బెదిరిపోయి మంగళవారం స్కూలుకు వెళ్లడం మానేశాడు. ఎందుకు స్కూలుకు వెళ్లలేదని మేనమామ మాన్‌సింగ్ ఆరా తీయగా.. బాధిత బాలుడు విషయం మొత్తం చెప్పాడు. 


మాన్‌సింగ్ వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్కూలుకు వెళ్లి చెక్ చేయగా ఆ బాలుడి స్కూటీలో తుపాకీ కనిపించింది. దీంతో బాలుడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. బాలుడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలుడి వద్ద ఉన్నది ఎయిర్ పిస్టల్ అని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-12T17:55:52+05:30 IST