Advertisement
Advertisement
Abn logo
Advertisement

16ఏళ్ల అమ్మాయికి తీవ్ర నడుపు నొప్పి.. నెలసరి వల్ల వచ్చే నొప్పేమో అని లైట్ తీసుకున్నారు.. కానీ వైద్యులు తేల్చేశారు..

ఇంటర్నెట్ డెస్క్: కొద్ది రోజులుగా 16ఏళ్ల అమ్మాయి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటే.. ఆమె కుటుంబ సభ్యులు లైట్ తీసుకున్నారు. యుక్త వయసులో ఉన్న సమయంలో కడుపు నొప్పి సహజం కదా అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ యువతికి కడుపు నొప్పి తీవ్రం అయింది. భరించలేని నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అనంతరం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ అమ్మాయిని పరీక్షించిన వైద్యులు.. ఆమె కుటుంబ సభ్యులకు షాకింగ్ విషయం చెప్పారు. డాక్టర్ల నోటి వెంట ఆ మాటలు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఆ అమ్మాయి కడుపు నొప్పికి కారణం ఏంటి? డాక్టర్లు ఆమెను పరీక్షించి.. కుటుంబ సభ్యులకు ఏం చెప్పారు? అనే వివరాల్లోకి వెళితే..


గుజరాత్‌లోని సూరత్ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడుతోంది. అయితే ఆమె నొప్పిని కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. యుక్త వయసులో ఉండటంతో నెలసరి సమయంలో వచ్చే నొప్పేమో అని భావించి లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా ఆ బాలికకు కడుపు నొప్పి ఎక్కువైంది. భరించలేని నొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కుటంబ సభ్యులకు షాకింగ్ విషయం చెప్పారు. 


16ఏళ్ల తమ కూతురు ఐదు నెలల గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాక.. కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని బాలికను విచారించారు. దీంతో ఆ అమ్మాయి నోరు విప్పింది. తన స్కూల్‌లో పని చేసే ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఆరు నెలల క్రితం తనకు ఇష్టం లేకున్నా అతడు శృంగారం కోసం బలవంతం చేసినట్టు పేర్కొంది. ఈ క్రమంలో సదరు యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సెక్షల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement