19 ఏళ్ల యువతి.. అతడి కోసం ఒంటరిగా 1400 కి.మీ. ప్రయాణం.. డబ్బుల్లేవ్.. ఫోన్ కూడా లేదు..

ABN , First Publish Date - 2021-06-19T21:56:42+05:30 IST

19 ఏళ్ల వయసు.. చేతిలో డబ్బుల్లేవు.. ఫోన్ లేదు.. ట్రైన్ టికెట్ కూడా లేదు..

19 ఏళ్ల యువతి.. అతడి కోసం ఒంటరిగా 1400 కి.మీ. ప్రయాణం.. డబ్బుల్లేవ్.. ఫోన్ కూడా లేదు..

19 ఏళ్ల వయసు.. చేతిలో డబ్బుల్లేవు.. ఫోన్ లేదు.. ట్రైన్ టికెట్ కూడా లేదు.. అయినా భర్త కోసం ఒంటరిగా పాట్నా నుంచి లూథియానా వరకు ప్రయాణించింది. ఆమెకు తెలిసిందల్లా ఒకటే.. తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది.


ఆమె అలా వెతకడం గమనించిన స్థానిక వ్యక్తి బుద్ధ దేవ్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం, ఆశ్రయం కల్పించాడు. తర్వాతి రోజు ఆమెను పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. అయితే తన భర్త గురించిన పూర్తి సమాచారాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని, ఇద్దరు పిల్లలు పుట్టారని, చిన్న గొడవ కారణంగా భర్త ఇంట్లో నుంచి లూథియానా వచ్చేశాడని పోలీసులకు చెప్పింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, కనీసం డబ్బులు కూడా తీసుకురాకుండా భర్త కోసం పాట్నా నుంచి లూథియానా వచ్చేసినట్టు చెప్పింది.


చివరకు ఎంతో అన్వేషణ తర్వాత ఆమె భర్త జాన్‌ను పోలీసులు కనుగొన్నారు. మొదట ఈమె ఎవరో తెలీదన్న జాన్ తర్వాత మొత్తం అంగీకరించాడు. పోలీసులు, స్థానిక నాయకుల చొరవతో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉండిపోతామని చెప్పాడు. 

Updated Date - 2021-06-19T21:56:42+05:30 IST