Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త చితాభస్మాన్ని రోజూ తింటున్న 26 ఏళ్ల భార్య.. ఇదేం పని అని అడిగితే ఆమె సమాధానమిదీ..!

‘‘బతికున్న భర్త బుర్ర తినే భార్యలను చూసుంటాం.. చీటికీ మాటికీ మొగుడితో గొడవ పెట్టుకుంటూ వేధించేవారినీ చూసుంటాం.. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను.. అవి కొని పెట్టు, ఇవి కొని పెట్టు అంటూ సతాయించే వారినీ చూసుంటాం’’.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ వీరందరికీ పూర్తి విభిన్నంగా ఉన్నట్టుంది. బతికున్నప్పుడు భర్తను ఎలా చూసుకుందో ఏమో గానీ.. చనిపోయి శ్మశానంలో ఉన్నా కూడా వదల్లేదు. ఎప్పుడూ తన వెంటే ఉండాలంటూ.. భర్త చితాభస్మాన్ని ఇంటికి తెచ్చుకుని, చక్కగా డబ్బాలో పోసుకుని రోజూ లొట్టలేసుకుని మరీ తింటోంది.. కనీవినీ ఎరుగని ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌‌కు చెందిన కాసీ(26) అనే మహిళకు.. సీన్ అనే వ్యక్తితో 2009లో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత భర్త ఆస్తమాతో బాధపడుతూ మృతి చెందాడు. భర్త బతికి ఉన్నప్పుడు.. దంపతులు ఎలా ఉన్నారో ఎవరికీ తెలీదు. అనారోగ్యంతో ఉన్న సమయంలో భర్తను ఎలా చూసుకుందో ఏమోగానీ.. చనిపోయిన భర్తపై ఆమెకు అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే శ్మశానానికి వెళ్లింది. అప్పటికే భర్త శవం కాలి బూడిదైంది. పైకా కుళ్లు కంపు కొడుతోంది. కానీ ఇవేవీ పట్టించుకోని ఆ మహిళ.. మొత్తం బూడిదనంతా ఓ బాక్సులో నింపుకొని ఇంటికి తీసుకొచ్చింది.

 చిన్న పిల్లలు చక్కెర తింటున్నట్లుగా.. రోజూ భర్త చితాభస్మాన్ని కొంచెం కొంచెం తింటూ ఉంటుంది. పైగా ఎక్కడికి వెళ్లినా చితాభస్మం బాక్సును మాత్రం మర్చిపోదట. ఈ విషయం ఆమే స్వయంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో తెలిపింది. తాను ఎక్కడున్నా.. పక్కనే చితాభస్మం బాక్సు ఉంటుందని, తినకుండా ఉండాలంటే నా వల్ల కావట్లేదని చెప్పింది. కుళ్లు కంపు కొడుతున్నా తినడాన్ని మాత్రం ఆపలేనని చెప్పుకొచ్చింది. తన భర్త రోజూ తనతో పాటే ఉన్నట్లు ఉందని తెలిపింది. బ్రిటన్‌‌కు చెందిన టీఎల్‌సీ ఛానెల్‌ వారు ఈ కథనాన్ని ప్రసారం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. చాలా మంది నెటిజన్లు దీనిపై పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎంత ప్రేముంటే మాత్రం.. ఇలా బూడిద తినడమేంటీ అంటూ చర్చించుకుంటున్నారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement