పెడిక్యూర్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం.. తపు ఒప్పుకున్న షాపు యజమాని.. రూ.13కోట్లు ఇచ్చేందుకు ఓకే..

ABN , First Publish Date - 2021-12-29T23:48:23+05:30 IST

ఆమెకు సుమారు 55ఏళ్లు ఉంటాయి. పెడిక్యూర్ కోసమని దగ్గరోని బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అనంతరం ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫలితంగా తన ఇంటిని కోల్పోవాల్సి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సదరు

పెడిక్యూర్ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం.. తపు ఒప్పుకున్న షాపు యజమాని.. రూ.13కోట్లు ఇచ్చేందుకు ఓకే..

ఎన్నారై డెస్క్: ఆమెకు సుమారు 55ఏళ్లు ఉంటాయి. పెడిక్యూర్ కోసమని దగ్గరోని బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అనంతరం ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫలితంగా తన ఇంటిని కోల్పోవాల్సి వచ్చింది. కాగా.. ప్రస్తుతం సదరు బ్యూటీపార్లర్ యజమాని తప్పు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆమెకు రూ.13కోట్లు ఇచ్చేందుకు ఒకే చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఫ్లోరిడాకు చెందిన 55ఏళ్ల క్లారా షెల్‌మాన్.. 2018లో స్థానికంగా ఉన్న టామీ నెయిల్స్ 2 అనే బ్యూటీపార్లర్‌ను సందర్శించింది. తనకు పెడిక్యూర్ చేయమని అక్కడి సిబ్బందిని కోరింది. దీంతో ఆమెకు పెడిక్యూర్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు చిన్నగాయం అయింది. అయితే అపుడు ఆమె దాన్ని లైట్‌గా తీసుకుని డబ్బులు చెల్లించి, అక్కడ నుంచి వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత గాయం దగ్గర ఇన్‌ఫెక్షన్ సోకడంతో.. వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షలూ చేసిన వైద్యులు.. మొత్తం కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఆపరేషన్ ద్వారా ఆ కాలును తొలగించారు. 



అనంతరం ఆసుపత్రి బిల్లును చూసి షాకైన ఆమె.. చాలా ఇబ్బందులు పడి ఆ మొత్తాన్ని కట్టేసింది. ఆ తర్వాత ఆర్థిక సమస్యల వల్ల ఆమె తన ఇంటినే కోల్పోవాల్సి వచ్చింది. అయితే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన సదరు బ్యూటీపార్లర్‌‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టును ఆశ్రయించింది. నాసిరకపు పరికరాలు వాడటం వల్లే తాను తన కాలును కోల్పోవాల్సి వచ్చిందని వాదించింది. అయితే మొదటగా బుకాయించిన సదరు బ్యూటీపార్లర్ యజమాని దాదాపు మూడేళ్ల తర్వాత ప్రస్తుతం తమ తప్పును ఒప్పుకున్నారు. అంతేకాకుండా నష్టపరిహారంగా ఆమెకు రూ.13కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. 




Updated Date - 2021-12-29T23:48:23+05:30 IST