పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధాన్ని పునరాలోచించండి: కేంద్రం

ABN , First Publish Date - 2021-01-18T07:33:03+05:30 IST

పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చికెన్‌, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించాయి.

పౌల్ట్రీ అమ్మకాలపై నిషేధాన్ని పునరాలోచించండి: కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 17: పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చికెన్‌, గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించాయి. అయితే.. వాటి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లు తినడానికి ఆరోగ్యకరమైనవేనని, ప్రజలు వదంతుల్ని నమ్మవద్దని కోరింది. ఇప్పటికే కొవిడ్‌ కారణంగా మందగించిన పౌలీ్ట్ర పరిశ్రమ, మొక్కజొన్న కొనుగోళ్లు.. అర్థరహితమైన పుకార్ల వలన మరోమారు కుదేలయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు.. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్‌ ఫ్లూ భయంతో వందలాది కోళ్లను వధిస్తున్నారు. 

Updated Date - 2021-01-18T07:33:03+05:30 IST