Viral News: ఆమెకు ఇదేం పిచ్చిరా బాబూ.. మరీ ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో..!

ABN , First Publish Date - 2021-10-11T03:22:13+05:30 IST

షైనీ అనే ఓ 25 ఏళ్ల అమ్మాయి.. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందుకోసం ఆమెను మేకప్ ఆర్టిస్టులు అందంగా తయారు చేశారు. ఆమె శరీరంపై ఉన్న టాటూలన్నింటినీ కవర్ చేసి.. అందంగా మార్చారు. అయితే

Viral News: ఆమెకు ఇదేం పిచ్చిరా బాబూ.. మరీ ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో..!

మనుషుల ప్రవర్తన ఒక్కోసారి వింతగా ఉంటుంది. ఎంతలా అంటే పిచ్చి.. పీక్స్‌కు వెళ్లేలా ఉంటుంది. చూసే వాళ్లకు మరీ అతి చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక అమ్మాయిల విషయానికొస్తే.. అందంగా కనిపించేందుకు ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసమే రోజూ బ్యూటీఫార్లర్స్‌కు క్యూ కడుతూ ఉంటారు. ముఖంలో ఏమాత్రం మార్పు వచ్చినా తట్టుకోలేరు. అయితే ఓ అమ్మాయి మాత్రం.. మరీ విచిత్రంగా ఉన్నట్టుంది. ఆ అమ్మాయి చేసిన పని చూస్తే.. ఈమెకు ఇదేం పిచ్చిరా బాబూ అని మీరే అంటారు.. వివరాల్లోకి వెళితే.. 


 షైనీ అనే ఓ 25 ఏళ్ల అమ్మాయి.. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొంది. ఇందుకోసం ఆమెను మేకప్ ఆర్టిస్టులు అందంగా తయారు చేశారు. ఆమె శరీరంపై ఉన్న టాటూలన్నింటినీ కవర్ చేసి.. అందంగా మార్చారు. అయితే ఇది ఆమెకు అసలు నచ్చలేదట. మేకప్ ఆర్టిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఎందుకంటే తనకు అందంగా ఉండడమంటే అస్సలు నచ్చదట. వెంటనే తనను దయ్యం రూపంలో మార్చాలని డిమాండ్ చేసిందట. శరీరం నిండా టాటూలు వేయించుకుంది. ఆఖరికి తన కళ్ల ఆకారాన్ని కూడా భయంకరంగా మార్చేసుకుంది. ఫైనల్‌గా తనను తాను చూసుకుని, ఎంతో మురిసిపోయింది.


ఆమెకు అందమైన రూపం తేవడానికి మేకప్ ఆర్టిస్ట్‌లు చాలా కష్టపడ్డారని, అందుకు షైనీ సంతోషించకుండా.. అందాన్ని చూసి అసహ్యించుకుందని టీవీ షో నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఇక ఎప్పుడూ అందంగా ఉండడానికి ప్రయత్నాలు చేయనని షైనీ తేల్చి చెప్పేసిందట. నిర్ణయం మార్చుకోమని ఎంతోమంది సన్నిహితులు చెప్పినా.. అస్సలు కుదరదని చెబుతోందట. దీంతో ఈ అమ్మాయికి ఇదేం పిచ్చిరా బాబూ.. అని అంతా తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2021-10-11T03:22:13+05:30 IST