Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెయిన్ లాగడంతో ఆగిన రైలు.. ఓ కుర్రాడు బ్యాగుతో సహా దిగడాన్ని చూసిన కానిస్టేబుల్.. వెంబడించి పట్టుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అది స్పెషల్ ట్రైన్. స్టేషన్ నుంచి అప్పుడే కదిలింది. ఇంతలోనే.. చెయిన్ లాగడంతో రైలు ఆగిపోయింది. ఏం జరిగి ఉంటుందా అని అంతా కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు బ్యాగుతో సహా ట్రైన్ దిగాడు. అదికాస్తా.. కానిస్టేబుల్ కంటపడంది. దీంతో పై అధికారులకు సమాచారం అందించి, అతడిని వెంబడించాడు. ఈ క్రమంలోనే ఓ ప్రదేశంలో పోలీసులు ఆ కుర్రాడిని పట్టుకున్నారు. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి షాకయ్యారు. కాగా.. పోలీసులు ఆ కుర్రాడి బ్యాగులో ఏం గుర్తించారనే వివరాల్లోకి వెళితే..


ముంబై-హౌరా మధ్య రైల్వే అధికారులు ఓ స్పెషల్ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం బయల్దేరిన ఆ రైలు.. అక్టోబర్ 29న మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. మధ్యప్రదే‌శ్‌లోని నార్సింగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌‌కు మధ్యాహ్నం 12.18 గంటలకు చేరుకుంది. ఆ స్టేషన్ దాటిన కొద్ది సమయానికే ఓ కుర్రాడు చైన్ లాగి, ట్రైన్ ఆపాడు. అనంతరం ఓ పెద్ద బ్యాగును పట్టుకుని ఆ కుర్రాడు ట్రైన్ దిగడాన్ని రైల్వే పోలీసు కానిస్టేబుల్ గమనించాడు.విషయాన్ని తన పై అధికారికి తెలిపాడు. ఈ నేపథ్యంలో రైల్వే ఎస్సై సహా కొందరు పోలీసు అధికారులు ఆ కుర్రాడిని వెంబడించారు. కొద్ది దూరం తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ కుర్రాడి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించారు.


అనంతరం ఆ బ్యాగులో ఉన్న రూ.75లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను చూసి నోరెళ్లబెట్టారు. దీంతో ఆ కుర్రాడిని స్టేషన్ తరలించి, విచారించారు. ఈ క్రమంలో కుర్రాడు అసలు విషయం చెప్పేశాడు. రాజస్థాన్‌కు చెందిన తాన పేరు జితేంద్ర అని, సాగర్‌లోని లక్ష్మణ్ చౌదరి అనే నగల వ్యాపారి వద్ద పని చేస్తున్నట్టు పోలీసులకు వెల్లడించాడు. తన యజమాని ఆదేశాల మేరకే.. రైలులోనే ప్రయాణిస్తున్న సందీప్ అనే వ్యక్తి వద్ద బ్యాగును స్వాధీనం చేసుకుని వెళ్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement