ప్రేయసిని కలిసేందుకు లగ్జరీ కార్లో బయల్దేరిన ప్రియుడు.. మార్గమధ్యంలో చేసిన పాడు పని సీసీ కెమెరాలో రికార్డవడంతో అడ్డంగా బుక్కయ్యాడు..!

ABN , First Publish Date - 2021-10-21T23:21:02+05:30 IST

ఓ యువకుడు కొద్ది రోజులుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పడం.. దానికి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అతడు తన ప్రేయసిని కలుసుకునేందుకు లగ్జరీ కారులో బయల్దేరాడు

ప్రేయసిని కలిసేందుకు లగ్జరీ కార్లో బయల్దేరిన ప్రియుడు.. మార్గమధ్యంలో చేసిన పాడు పని సీసీ కెమెరాలో రికార్డవడంతో అడ్డంగా బుక్కయ్యాడు..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు కొద్ది రోజులుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పడం.. దానికి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అతడు తన ప్రేయసిని కలుసుకునేందుకు లగ్జరీ కారులో బయల్దేరాడు. మనసుపడ్డ అమ్మాయిని కళ్లారా చూసి అనంతరం తిరుగు ప్రయాణం అయ్యాడు. ప్రేయసి స్వస్థలం నుంచి బయల్దేరినవాడు.. తిన్నగా తన స్వస్థలానికి రాకుండా మార్గమధ్యంలో ఓ పాడు పని చేశాడు. అదికాస్తా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో అడ్డంగా బుక్కయ్యాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌కు చెందిన రియాజుద్దిన్ కొద్ది రోజుల క్రితం ఓ పని మీద లగ్జరీ కారులో అజ్మీర్ వెళ్లాడు. అక్కడ పని పూర్తైన తర్వాత నేరుగా జై‌పూర్ వెళ్లాల్సి ఉండగా అతడు అలా చేయలేదు. తన ప్రియురాలిని కలిసేందుకు లగ్జరీ కారులోనే చురూకు వెళ్లాడు. అక్కడ తాను ప్రేమిస్తున్న యువతిని రియాజుద్దిన్ కలిశాడు. కళ్లారా ఆమెను చూసిన తర్వాత తిరిగి తన స్వస్థలానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అతడు తిన్నగా రాకుండా ఓ పాడు పని చేశాడు. ఖర్చులకు కావాల్సిన డబ్బు కోసం మూడు మేకలను దొంగతనం చేశాడు. కాగా.. ఆ మేకల యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. 



సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారు నెంబర్ ప్లేటును గుర్తించి.. విచారణ జరిపారు. దీంతో రియాజుద్దిన్ చేసిన బాగోతం బయటికొచ్చింది. ఈ క్రమంలో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రియాజుద్దిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రియాజుద్దీన్ నడిపిన కారు.. అతడిది కాదని.. ఓ వ్యక్తి దగ్గర అతడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని వెల్లడించారు. ఓ పని మీద అజ్మీర్ వెళ్లిన అతడు.. ఆ తర్వాత చురూలో ఉన్న తన ప్రియురాలను కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో దారి ఖర్చుల కోసం అక్టోబర్ 11న మూడు మేకలను దొంగతనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రియాజుద్దిన్ ఒప్పుకున్నట్లు వెల్లడించారు. 




Updated Date - 2021-10-21T23:21:02+05:30 IST