భారీ పామును చూసిన యువతి.. ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-06-16T02:07:51+05:30 IST

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఏదంటే ఎక్కువ భయపడతారో తెలుసా?

భారీ పామును చూసిన యువతి.. ఏం చేసిందంటే..

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఏదంటే ఎక్కువ భయపడతారో తెలుసా?  ఈ ప్రశ్నకు ఓ సర్వేలో అధిక శాతం మంది పాము పేరే చెప్పారు. పాములు ఉంటాయని తెలిస్తే చాలు.. చాలా మంది అటు వైపు వెళ్లనే వెళ్లరు. ఇక, మహిళలైతే పాము పేరు చెబితేనే భయపడతారు. అలాంటిది ఓ యువతి మాత్రం ఓ భారీ పామును ధైర్యంగా పట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఓ ఇంటి నిర్మాణ స్థలంలో ఉన్న టైల్స్ కిందకు ఓ భారీ పాము దూరింది. దానిని చూసి అక్కడున్న అందరూ భయపడ్డారు. అయితే ఓ యువతి అక్కడకు వెళ్లి పామును చెత్తో పట్టుకుని బయటకు తీసింది. అనంతరం ఆ పామును ఇంటికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది. యువతి పామును పడుతుండగా అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2021-06-16T02:07:51+05:30 IST