చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-03-10T06:49:59+05:30 IST

: ప్రతీఒక్కరు చదువుకునప్పుడే వారి జీవితం ఉజ్వల భవిష్యత్తుగా వెలుగుతుందని శిక్షణ కలెక్టర్‌ గ్రూపు లీడర్‌ ప్రశాంత్‌బాజీరావ్‌ పాటిల్‌ అన్నారు. కలెక్టర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని సుంకిడిలో గత మూడు రోజులుగా శిక్షణ పొందుతున్నారు. గ్రా మాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల పని తీరు ను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ మ్యాప్‌ను పరిశీలిస్తున్న శిక్షణ కలెక్టర్లు

తలమడుగు, మార్చి 9: ప్రతీఒక్కరు చదువుకునప్పుడే వారి జీవితం ఉజ్వల భవిష్యత్తుగా వెలుగుతుందని శిక్షణ కలెక్టర్‌ గ్రూపు లీడర్‌ ప్రశాంత్‌బాజీరావ్‌ పాటిల్‌ అన్నారు. కలెక్టర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని సుంకిడిలో గత మూడు రోజులుగా శిక్షణ పొందుతున్నారు. గ్రా మాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల పని తీరు ను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదుకునప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఉపాధ్యాయులు సూచించిన సలహాలు, సూచనలు పాటించి లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అందిస్తున్న పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గ్రామంలో సర్పంచ్‌ మహేందర్‌యాదవ్‌ చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమన్నారు.  అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. ఇందులో శిక్షణ కలెక్టర్లు చంద్రప్రకాష్‌, మణిందర్‌సింగ్‌, శ్రీమృద్యుల్‌, అజిత్‌ప్రతాప్‌ సింగ్‌, తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీఈవో దిలీప్‌కుమార్‌, వ్యవసాయాధికారి మహేందర్‌, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-10T06:49:59+05:30 IST