రంగంలోకి దిగితే తగ్గేదేలేదంటున్న తాత.. ఆయనను చూసేందుకు ఎగబడుతున్న జనం

ABN , First Publish Date - 2021-10-07T02:49:44+05:30 IST

అతడికి ప్రస్తుతం 88ఏళ్లు.. కానీ బరిలోకి దిగితే మాత్రం నవ యువకుడిగా మారిపోతాడు. ఫుట్‌బాల్ మైదానంలో పాదరసంలా కదిలిపోతూ.. ఏ మాత్రం బెరకు లేకుండా గోల్స్‌ను అడ్డుకుంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీ

రంగంలోకి దిగితే తగ్గేదేలేదంటున్న తాత.. ఆయనను చూసేందుకు ఎగబడుతున్న జనం

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 88ఏళ్లు.. కానీ బరిలోకి దిగితే మాత్రం నవ యువకుడిగా మారిపోతాడు.  ఫుట్‌బాల్ మైదానంలో పాదరసంలా కదిలిపోతూ.. ఏ మాత్రం బెరకు లేకుండా గోల్స్‌ను అడ్డుకుంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఆయన మైదానంలో ఉన్నాడని తెలిస్తే చాలు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అలాన్ కామ్సెల్‌కు ఫుట్‌బాల్ అంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమే ఆయనను 88ఏళ్ల వయసులో మైదానం వైపు నడిపిస్తూ గోల్ కీపర్‌గా ఆడేలా చేస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ నార్త్ వేల్స్‌లోని ఓ లోకల్ ఫుట్ బాల్ క్లబ్ (Bay Stollers FC) తరఫున ఆడుతున్న అలాన్ కామ్సెల్.. అద్భుత ఆట తీరును కనబరుస్తున్నారు. బంతి తనను దాటి పోకుండా చూస్తూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సహచర ఆటగాళ్ల మనవళ్లతో కలిసి ఇప్పుడు మ్యాచ్‌లు ఆడుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈయన ఆట తీరుపై ఓ మీడియా సంస్థ కథనాలు వెలువరించగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. దీంతో అలాన్ కామ్సెల్.. మైదానంలో ఉన్నారంటే చాలు ఆయన ఆట చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. 




Updated Date - 2021-10-07T02:49:44+05:30 IST