Advertisement
Advertisement
Abn logo
Advertisement

లోయలో పడ్డ బస్సు

  • ఇద్దరికి స్వల్ప గాయాలు
  • ప్రమాద సమయంలో అందులో నలుగురే
  • తప్పిన పెనుముప్పు
  • కర్నూలు జిల్లాలో ప్రమాదం
  • ‘పశ్చిమ’లో పంట కాల్వలోకి దూసుకుపోయిన రెండు కార్లు


ఆళ్లగడ్డ, కొవ్వూరు, నవంబరు 29: కర్నూలు జిల్లా ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 25 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు ఉదయం 10.30 గంటలకు ఎగువ అహోబిలంలో బయలుదేరింది. డ్రైవరు జేకే బాషా రివర్స్‌ చేసే ప్రయత్నంలో బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో డ్రైవరుతో కలిపి నలుగురు ప్రయాణికులున్నారు. ఇద్దరికి స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవరు, మరో వ్యక్తి క్షేమంగా బయటపడ్డారు. సాయంత్రం బస్సును లోయలో నుంచి బయటకు తీశారు.


మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు-కొవ్వూరు రోడ్డులో అతి వేగంగా ప్రయాణించిన రెండు కార్లు పంట కాల్వలోకి దూసుకు పోయాయి. కొవ్వూరుకు చెందిన యువకులు  మరో కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా ద్విచక్రవాహనం రావడంతో అంతే వేగంగా ఎడమవైపు స్టీరింగ్‌ తిప్పారు. ముందు వెళుతున్న కారుతో సహా రెండు కార్లూ కాలువలోకి దూసుకుపోయాయి. కార్లలో ఉన్నవారు సురక్షితంగా బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
Advertisement