Viral News: రూ.16లక్షలను చెత్తకుప్పలో పడేసిన Businessman

ABN , First Publish Date - 2021-11-08T14:59:11+05:30 IST

సాధారణంగా ఎవరైనా సరే డబ్బులు కింద పడితే.. వాటిని తీసుకుని ఠక్కున జేబులో పెట్టుకోరు. పాకెట్‌లో పెట్టుకునే ముందు వాటిని మొక్కుతారు. అలాగే రోజంతా కష్టపడి పని చేసి, సంపాధించిన డబ్బు.. క

Viral News: రూ.16లక్షలను చెత్తకుప్పలో పడేసిన Businessman

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎవరైనా సరే డబ్బులు కింద పడితే.. వాటిని తీసుకుని ఠక్కున జేబులో పెట్టుకోరు. పాకెట్‌లో పెట్టుకునే ముందు వాటిని మొక్కుతారు. అలాగే  రోజంతా కష్టపడి పని చేసి, సంపాధించిన డబ్బు.. కనబడకుండా పోతే కంగారు పడిపోతాం. ఆ డబ్బు కనపడే వరకూ మనసు కుదుట పడదు. అయితే ఓ వ్యాపారి చేసింది తెలిసి అందరూ షాకవుతున్నారు. తాను సంపాధించిన రూ. 16లక్షల డబ్బును తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మాములుగా వ్యాపారవేత్త వేత్తలు క్షణం కూడా తీరిక లేకుండా వ్యాపారానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. పనుల్లో పడిపోయి.. అన్నం తినే విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. గ్రీక్ దేశానికి చెందిన వ్యాపారవేత్త కూడా ఈ కోవకు చెందిన వాడే. ప్రతి రోజూ వెళ్లినట్టుగానే.. ఆ వ్యాపారవేత్త షాప్ తెరవాలనే తొందరలో ఉదయాన్నే ఇంటి నుంచి బయల్దేరాడు. దారిలో ఉన్న డస్ట్‌బిన్‌లో వేయాలనే ఉద్దేశంతో.. వెళ్తూ.. వెళ్తూ.. చెత్త సంచీని కూడా పట్టుకెళ్లాడు. ఆ తర్వాత.. డస్ట్‌బిన్‌లో చెత్త సంచీతోపాటు పొరపాటున మరో చేతిలో ఉన్న 19వేల యూరోలు(సుమారు రూ.16లక్షలు)గల బ్యాగును కూడా అందులో పడేశాడు. 


షాపునకు వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన ఆ వ్యాపారి.. మళ్లీ ఆ డస్ట్‌బిన్ వద్దకు పరుగెత్తుకొచ్చాడు. అయితే ఆ డస్ట్‌బిన్‌లో తాను వేసిన రెండు సంచులూ లేకపోవడంతో కంగుతిన్నాడు. అంతేకాకుండా విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సహాయంతో చెత్తను తీసుకెళ్లే వాహాన్ని ట్రేస్ చేసి పట్టుకున్నాడు. అనంతరం అందులో వెతికాడు. ఈ క్రమంలోనే అతడికి మొదట తాను వేసిన చెత్త సంచీ కనిపించింది కానీ డబ్బు సంచీ కనబలేదు. అయితే తాను మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. దాదాపు గంట వరకూ వెతికిన తర్వాత అతడికి తన డబ్బు దొరికింది. దీంతో ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. 




Updated Date - 2021-11-08T14:59:11+05:30 IST