సందడే సందడి..!

ABN , First Publish Date - 2020-10-16T05:58:03+05:30 IST

కరోనా వల్ల ఐదారు మాసాలుగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు వెలవెలపోగా ఇప్పుడు ఒక్కసారిగా మార్కెట్‌లో సందడి నెలకొంది

సందడే సందడి..!

బిజీ బిజీగా మారిన మార్కెట్‌..

బతుకమ్మ, దసరా పండుగకు జోరుగా కొత్త వస్త్రాలు కొనుగోలు

జాడ లేని భౌతిక దూరం

కనిపించని కరోనా భయం..


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల)

కరోనా వల్ల ఐదారు మాసాలుగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు వెలవెలపోగా ఇప్పుడు ఒక్కసారిగా మార్కెట్‌లో సందడి నెలకొంది.  దసరా, బతుకమ్మ పండుగలు సమీపిస్తుండటంతో వ్యా పార, వాణిజ్య సంస్థలు పుంజుకుంటున్నాయి. పల్లె, పట్టణవాసులు నూతన వస్త్రాల కొనుగోళ్లు చేస్తుండటంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని కూడళ్లు సందడి సందడిగా మారాయి. 


సందడి సందడిగా మార్కెట్లు

జగిత్యాల జిల్లాలో మూడు, నాలుగు రోజులుగా మార్కెట్‌ సందడి గా మారింది. లక్షెట్టిపేట, జన్నారం, ఆర్మూర్‌ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి బట్టల కొనుగోళ్లకు వస్తూ ఉంటారు. ఇప్పుడు బతుకమ్మ పండుగతో పాటు దసరా సమీపిస్తుండటంతో బట్టలు కొనుగోలుకు పె ద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల చాలా మంది ఐ దారు మాసాలుగా ఇళ్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు పండుగ స మీపిస్తుండటంతో ఎవరికి వారు సర్దుబాటు చేసుకుంటూ బట్టల కొ నుగోలుపై దృష్టి పెట్టారు. దీంతో జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కో రుట్ల, మెట్‌పల్లిలాంటి పట్టణాల్లోని వ్యాపార సంస్థలన్నీ సందడిగా మారాయి. చాలా రోజుల తర్వాత జగిత్యాలలోని టవర్‌ సర్కిల్‌ ప్రాం తం జనంతో కిటకిటలాడుతోంది. 


జాడలేని భౌతిక దూరం..

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడం లేదని ప్రజలు జాగ్రత్తగా ఉం డాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ప్రజలు పెడచెవిన పెడు తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దసరా, బతుకమ్మ పండుగల పేరిట ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. వస్త్ర, వ్యాపార సంస్థల వద్ద ఎలాంటి కొవిడ్‌ నిబధనలు పాటించడం లేదు.


వ్యాపార సంస్థల్లో కూడా నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. కొందరైతే మాస్కులు కూడా ధరించడం లేదు. షాపుల నిర్వాహకులు కనీసం శానిటైజర్లను కూడా అందుబాటులో పెట్టడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొ రవ తీసుకుని పట్టణ ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు నిబంధనలు పా టించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-10-16T05:58:03+05:30 IST