Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాల్‌గాళ్‌ను బుక్ చేసుకున్న యువకుడు.. రాత్రి 9.30 గంటలకు కారులో వచ్చిన ఇద్దరు యువతులు.. ఆ తర్వాత జరిగిన పనికి అతడు షాక్

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడికి ఈ మధ్యే జీతం డబ్బులు చేతికందాయి. నవంబర్‌లో దీపావళి పండగ ఉన్నందున బోనస్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే అతడికి ఓ ఆలోచన వచ్చింది. బోనస్ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే వెబ్‌సైట్ ద్వారా కాల్‌గాళ్‌ను బుక్ చేసుకున్నాడు. దీంతో అక్కడి నుంచి అతడికో ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో అతడికి ఓ ప్రాంతం పేరు చెప్పి, రాత్రి 9.30గంటలకు ఆ ప్రదేశంలో ఉండాలని నిర్వాహకులు సూచించారు. దీంతో ఆ యువకుడు ఉత్సాహంగా బయల్దేరాడు. చెప్పిన సమయం కంటే ముందే అక్కడకు చేరుకున్నాడు. ఇంతలో రాత్రి 9.30 గంటలకు ఓ కారొచ్చింది. అందులో ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతులలో ఒక యువతిని అతడు ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌‌కు చెందిన భగీరథ్ అనే యువకుడు జై‌పూర్‌లోని ఉన్న ఓ ప్రముఖ విద్యాసంస్థలో పని చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా ఆ ప్రముఖ విద్యాసంస్థ యాజమాన్యం.. తమ ఉద్యోగులకు జీతాలతో పాటు బోనస్‌ను కూడా అందించింది. ఈ క్రమంలో భగీరథ్‌కు కూడా బోనస్ డబ్బులు అందాయి. ఈ క్రమంలో ఆ మొత్తం డబ్బులను ఉపయోగించి, అమ్మాయితో ఎంజాయ్ చేయాలని భగీరథ్ నిర్ణయించుకున్నాడు. ఓ వెబ్‌సైట్ ద్వారా కాల్‌గాళ్‌ను బుక్ చేసుకున్నాడు. దీంతో అతడికి ఫోన్‌కు నిర్వాహకుల నుంచి సందేహం వచ్చింది. మహేశ్ నగర్‌ ప్రాంతంలో ఉన్న గోపాలపుర బైపాస్ రోడ్డులో రాత్రి 9.30 గంటలకు అమ్మాయిని పికప్ చేసుకోవాలని అందులో భగీరథ్‌కు సూచించారు. దీంతో అతడి ఆనందం రెట్టింపు అయింది. 


నిర్వాహకులు చెప్పిన ప్రదేశానికి ఉత్సాహంగా బయల్దేరాడు. చెప్పిన సమయం కంటే ముందే అక్కడకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సరిగ్గా 9.30 గంటలకు ఓ కారు వచ్చి, భగీరథ్ వద్ద ఆగింది. అందులో ఇద్దరు బ్రోకర్లు సహా.. ఇద్దరు అమ్మాయిలు ఉండటంతో వారిలో ఒకరిని భగీరథ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో బ్రోకర్లకు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయబోగా.. వాళ్లు.. క్యాష్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో భగీరథ్.. తన పాకెట్ నుంచి లక్ష రూపాయలను బయటకు తీశాడు. దీంతో ఆ మొత్తంపై ఆ బ్రోకర్ల కన్ను పడింది. భగీరథ్‌ను చితకబాది.. లక్షరూపాలయను లాక్కున్నారు. అనంతరం అతడిని పక్కకు నెట్టి, కారులో పరారయ్యారు. దీంతో భగీరథ్ ఒక్కసారిగా షాకయ్యాడు. కాగా.. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement