ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సడన్‌గా అదృశ్యం.. అంతా కంగారుపడుతుండగా ఇంతలో ఫోన్.. చివరికి అసలు విషయం తెలిసి..

ABN , First Publish Date - 2022-01-30T02:11:40+05:30 IST

అప్పటి వరకూ కళ్ల ముందే ఉన్న చిన్నారి.. సడన్‌గా అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులంతా కంగారుపడ్డారు. బాలుడి కోసం వెతుకుతుండగా.. ఇంతలో వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. చివరికి..

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సడన్‌గా అదృశ్యం.. అంతా కంగారుపడుతుండగా ఇంతలో ఫోన్.. చివరికి అసలు విషయం తెలిసి..
ప్రతీకాత్మక చిత్రం

అప్పటి వరకూ కళ్ల ముందే ఉన్న చిన్నారి.. సడన్‌గా అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులంతా కంగారుపడ్డారు. బాలుడి కోసం వెతుకుతుండగా.. ఇంతలో వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. చివరికి అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. 

బీహార్ నవాడ జిల్లా పరిధిలోని భట్టా గ్రామంలో జైచంద్ర ప్రసాద్ అనే వృద్ధుడు భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతడి కుమార్తెను రాకేష్‌కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ఆలోక్‌కుమార్(3) అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్యా, కొడుకుతో కలసి రాకేష్ కుమార్ సూరత్‌లో ఉంటున్నాడు. రాకేష్‌ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కాగా, ఇటీవలే తల్లిదండ్రులను చూసి వెళ్లాలనే ఉద్దేశంతో కొడుకును తీసుకుని రాకేష్‌కుమార్ భార్య తన పుట్టింటికి వచ్చింది. కూతురు, మనువడితో వృద్ధ దంపతులు సంతోషంగా గడిపారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం చిన్నారి ఆలోక్‌కుమార్ ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి ఇంట్లోని వారికి అరుపులు వినిపించాయి.


చిన్నారి ఏడుపు వినిపించడంతో ఏమైందో ఏమో అని అంతా బయటికొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి కనిపించలేదు. దీంతో కంగారుగా ఇంటి పరిసరాల్లో వెతికారు. చిన్నారి కోసం కంగారు పడుతున్న క్రమంలో వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ మనువడిని కిడ్నాప్ చేశాం.. అర్జంటుగా రూ.5లక్షలు ఇస్తే విడిచిపెడతాం.. లేదంటే చంపేస్తాం’’.. అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో అంతా కంగారుపడ్డారు. ‘‘డబ్బులు ఎలాగైనా సర్దుబాటు చేస్తాం.. బాబును ఏం చేయొద్దు’’.. అంటూ వేడుకున్నారు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే డబ్బులు సర్దుబాటు చేయడంలో ఆలస్యమవడంతో కిడ్నాపర్లు చిన్నారిని చంపేశారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు.

పూల దండ విషయంలో గొడవ.. చివరకు ఈ పెళ్లికూతురు చేసిన పని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు..


తమ మనువడిని గ్రామానికి చెందిన రాజేంద్ర చౌదరి మనుషులే చంపేశారని వృద్ధుడు జైచంద్ర ప్రసాద్ ఆరోపించాడు. తమ ఇంటికి సమీపంలోని రాజేంద్ర చౌదరితో తమకు మూడు ఎకరాల భూమి విషయంలో కొన్నేళ్లుగా వివాదం జరుగుతోందన్నాడు. తమ మీద కోపంతోనే చిన్నారిని హత్య చేశారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమ మనువడిని కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మోడుబారిపోయినట్టు కనిపిస్తున్న ఈ చెట్టుకు 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

Updated Date - 2022-01-30T02:11:40+05:30 IST