స్పష్టమైన హామీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-27T06:29:23+05:30 IST

చండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుపై స్పష్ట మైన హామీ ఇవ్వాలని బీజేవైఎం స్టడీ సర్కిల్‌ రాష్ట్ర కన్వీనర్‌ భూతరాజు శ్రీహరి డిమాండ్‌ చేశారు.

స్పష్టమైన హామీ ఇవ్వాలి
విలేకరులతో మాట్లాడుతున్న భూతరాజు శ్రీహరి

లేదంటే మంత్రి పర్యటనలో ఆందోళన చేపడతాం : బీజేవైఎం 

 స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకపోవడం బాధాకరం : కాంగ్రెస్‌ 

చండూరు, జనవరి 26: చండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటుపై స్పష్ట మైన హామీ ఇవ్వాలని బీజేవైఎం స్టడీ సర్కిల్‌ రాష్ట్ర కన్వీనర్‌ భూతరాజు శ్రీహరి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన చండూరులో విలేకరులతో మాట్లాడు తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా నేటికీ సొంత భవనం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐదు ఎకరాల స్థలంలో సొంత భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రి జగదీష్‌రెడ్డి అనేకసార్లు చండూరు పర్యటనకు వ చ్చారని, కళాశాల సొంత భవనం గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ మంత్రి జగదీష్‌రెడ్డి తన పర్యటన కోసం చండూరుకు వస్తున్నారని, కళాశాల సొంత భవనంపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ల గణేష్‌, పట్టణ అధ్యక్షుడు సోమ శంకర్‌, ప్రధాన కార్యదర్శి స్వామి, బొబ్బిలి శివ, దోటి శివ, మన్నెం ప్రవీణ్‌, ఏలె నరేందర్‌, వేముల పవన్‌ తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి సంగతి ఏమిటి : కాంగ్రెస్‌ 

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ సరే.. అభివృద్ధి సంగతి ఏమిటని డీసీసీ ప్రధాన కార్యదర్శి  గండు వెంకట్‌గౌడ్‌ అన్నారు. చండూరు మునిసిపల్‌ వైస్‌ చైర్మెన్‌ దోటి సుజాత నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి చండూరు పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గతంలో గట్టుప్పల మండలంపై మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న, మునిసిపల్‌ అధ్యక్షుడు దోటి వెంకటేశ్‌ యాదవ్‌, జిల్లా నాయకులు కల్లెట్ల మారయ్య, ఇరిగి రాజు, గొల్లగూడెం సర్పంచ్‌ సాపిడి రాములు, పాల్గొన్నారు. 


మంత్రి జగదీ్‌షరెడ్డి పర్యటన రద్దు

మంత్రి జగదీ్‌షరెడ్డి నేటి చండూరు పర్యటన రద్దయింది. మండలంలోని 18 గ్రామపంచాయితీల్లో 94 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేయాల్సి ఉంది. కార్యక్రమం రద్దు కావడంతో లబ్ధిదారులకు ఎదురుచూపు తప్పేలా లేదు. 

Updated Date - 2022-01-27T06:29:23+05:30 IST