మేడారం గద్దెల వద్ద దర్శనమిచ్చిన నాగుపాము

ABN , First Publish Date - 2021-04-22T05:45:19+05:30 IST

మేడారం గద్దెల వద్ద దర్శనమిచ్చిన నాగుపాము

మేడారం గద్దెల వద్ద దర్శనమిచ్చిన నాగుపాము
పుట్ట నుంచి వస్తున్న నాగుపాము

మేడారం, ఏప్రిల్‌ 21:  సమ్మక్క-సారలమ్మల సన్నిధిలోని క్యూలైన్ల వద్ద ఉన్న పుట్టలో నాగుపాము బుధవారం దర్శనమిచ్చింది. వనదేవతల ను దర్శించుకునేందుకు వచ్చిన భక్తు లు సమ్మక్కతల్లి పాము రూపంలో వచ్చి ఆశీర్వదించిందని పులకించిపోయారు. వెంటనే తల్లి చల్లగా చూడాలని మొక్కుకున్నారు. నాగుపామును గమనించిన దేవాదాయ శాఖ అధికారులు పుట్ట నుంచి తిరిగి వెళ్లిపోయే వరకు క్యూలైన్ల వద్ద కదలికలను గమనిస్తూ కాపలా ఉన్నారు. మేడారం గద్దెల పరిసరాల్లో పాము కనిపించడం సంతోషంగా ఉందని, ఆ తల్లి కరుణించి దర్శనమిచ్చిందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో మహాజాతర సందర్భంగా చెట్టుపై నుంచి నాగుపాము కనిపించేదని భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే బుధవారం నాగుపాము కనిపించడంతో భక్తులు సంతోషం వ్యక్తంచేశారు.


Updated Date - 2021-04-22T05:45:19+05:30 IST